Sunday, January 19, 2025
Homeసినిమాద‌స‌రా నుంచి బింబిసార 2 క‌థ స్టార్ట్

ద‌స‌రా నుంచి బింబిసార 2 క‌థ స్టార్ట్

నంద‌మూరి క‌ళ్యాణ్ హీరోగా నూత‌న ద‌ర్శ‌కుడు వ‌శిష్ట్ తెర‌కెక్కించిన చిత్రం ‘బింబిసార‌’. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై రూపొందిన బింబిసార బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ సాధించింది. ‘క‌ళ్యాణ్ రామ్’ కెరీర్ లో ఎప్ప‌టికీ మ‌రచిపోలేని సినిమాగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవ‌ర్ సీస్ లో సైతం రికార్డు క‌లెక్ష‌న్స్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. అయితే.. బింబిసార రిలీజ్ కాకుండానే.. బింబిసార 2 ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు మేక‌ర్స్.

ఇప్పుడు ‘బింబిసార 2‘ ఎలా ఉంటుంది.? ఎప్పుడు స్టార్ట్ చేస్తారు..?  ఎప్పుడు రిలీజ్ చేస్తారు..? అనేది ఆస‌క్తిగా మారింది. ఈ మూవీ గురించి లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే… డైరెక్ట‌ర్ వ‌శిష్ట్ ప్ర‌స్తుతం స‌క్సెస్ ని ఎంజాయ్ చేస్తూ.. గుళ్లు గోపురాలు తిరుతున్నాడ‌ట‌. ఇంకా బింబిసార 2 స్క్రిప్ట్ వ‌ర్క్ స్టార్ట్ చేయ‌లేద‌ట‌. ద‌స‌రా నుంచి బింబిసార 2 క‌థ పై క‌స‌ర‌త్తు స్టార్ట్ చేస్తార‌ట‌. ఇక క‌ళ్యాణ్ రామ్ ఇప్ప‌టికే ఓకే చేసిన సినిమాల‌ను పూర్తి చేసి ఆ త‌ర్వాత బింబిసార 2 మొద‌లెడ‌తార‌ట‌.

మ‌రో విషయం ఏంటంటే.. బింబిసార 2 చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మించనున్నారు. మొదటి భాగాన్ని 40 కోట్లతో నిర్మించగా, 2వ భాగానికి గాను అంతకు రెట్టింపు బడ్జెట్ ను కేటాయించినట్టు సమాచారం. ఈ సినిమాలో లేడీ విలన్ రోల్ ను పవర్ ఫుల్ గా డిజైన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి లేడీ విల‌న్ పాత్ర కోసం ఎవ‌ర్ని తీసుకోనున్నారు అనేది ఆస‌క్తిగా మారింది. మ‌రి.. బింబిసార 2తో కూడా స‌క్సెస్ సాధిస్తారేమో చూడాలి.

Also Read : బింబిసార 2 లో ఎన్టీఆర్? క్లారిటీ ఇచ్చిన క‌ళ్యాణ్ రామ్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్