Saturday, January 18, 2025
Homeసినిమాబింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టిస్తూ.. నిర్మించిన భారీ సోషియో ఫాంట‌సీ మూవీ బింబిసార‌. ఈ చిత్రం ద్వారా వ‌శిష్ట్ డైరెక్ట‌ర్ గా పరిచయం అవుతున్నారు. ఇందులో క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న కేథ‌రిన్, సంయుక్త మీన‌న్ న‌టించారు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన ట్రైల‌ర్ బింబిసార మూవీ పై అంచ‌నాల‌ను భారీగా పెంచేసింది. ఆగ‌ష్టు 5న బింబిసార చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌నున్నారు. దీంతో నంద‌మూరి అభిమానులు ఎప్పుడెప్పుడు బింబిసార వ‌స్తుందా అని ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు.

ఇక ప్రీ రిలీజ్ విష‌యానికి వ‌స్తే.. ఈ ఈవెంట్ ను జూలై 29న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సాయంత్రం 6 గంటల నుంచి భారీ స్థాయిలో నిర్వహించనున్నారు. బింబిసార‌ లుక్ లో కళ్యాణ్ రామ్ వైలెంట్ గా కనిపించనున్నాడు. అలాగే ఈ సినిమాలో బింబిసార అనే క్రూరమైన రాజుగా శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. అంతే కాకుండా ఈ మూవీ పార్ట్ 2, 3 కూడా ఉన్నాయ‌ని ప్ర‌క‌టించ‌డంతో ఈ మూవీ పై మ‌రింత ఆస‌క్తి ఏర్ప‌డింది. మ‌రి.. బింబిసార ఏ రేంజ్ స‌క్సెస్ సాధిస్తుందో చూడాలి.

Also Read : బింబిసార ట్రైల‌ర్ పై మెగా హీరో కామెంట్స్

RELATED ARTICLES

Most Popular

న్యూస్