Monday, May 20, 2024
HomeTrending Newsరిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కేంద్రం కుట్ర - మంత్రి ఎర్రబెల్లి

రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కేంద్రం కుట్ర – మంత్రి ఎర్రబెల్లి

దేశంలో అంబేద్కర్ స్పూర్తిని ముఖ్యమంత్రి కేసిఆర్ పాటిస్తున్నట్లు, రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నట్లు మరెవరూ చేయడం లేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా హనుమకొండ, అంబేద్కర్ సర్కిల్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి, మంత్రి నివాళులు అర్పించారు. మంత్రితో పాటు మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, నన్నపనేని నరేందర్, కలెక్టర్ గోపి, జిడబ్ల్యుఎంసి కమిషనర్ ప్రావీణ్య తదితరులు అంబేద్కర్ కి పూలమాల వేసి, నివాళులు అర్పించారు.

అనంతరం మీడియా మిత్రులతో మంత్రి మాట్లాడుతూ…

బాబా సాహెబ్ అంబేద్కర్ ఒక దళిత వర్గానికే కాదు సమాజంలోని అందరికీ చెందినవారు. కేంద్ర ప్రభుత్వం బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా దేశంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులను కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పి, రిజర్వేషన్లు అమలు చేయకుండా ఉండేందుకు పూనుకుంది. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. రిజర్వేషన్లను మంటగలిపే కుట్ర చేస్తోంది చైతన్యంగా ఉండి, బిజెపి చేసే కుట్రలను వ్యతిరేకించాలి. సిఎం కేసిఆర్ అన్ని విషయాల్లో రాజ్యాంగ నిర్మాతకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటున్నారు. కొంతమంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నరు. వాటిని తిప్పికొట్టాలి. దేశం అంతా ప్రైవేటీకరణ చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ఉద్యమించాలి. ప్రభుత్వంలోని ప్రతి ఆస్తిని, ఫ్యాక్టరినీ ప్రైవేటీకరణ చేసే కుట్ర జరుగుతోంది. ఉద్యమిస్తేనే కేంద్రం దిగి వస్తుంది. లేకపోతే మొండిగా వెళ్తుంది. ఉద్యమిస్తే కేంద్రం కూడా దిగి వస్తుంది. రాజ్యాంగ వ్యతిరేక కుట్రలను తిప్పికొట్టే ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్