Sunday, November 24, 2024
HomeTrending Newsమరమనిషి అనే పదం నిషేధితమా - రఘునందన్

మరమనిషి అనే పదం నిషేధితమా – రఘునందన్

ఎంత మంది శాసన సభ్యులు ఉంటే bac సమావేశానికి పిలుస్తారో రూల్స్ ఉంటే చెప్పండని బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసన సభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి , స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలన్నారు. బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈ రోజు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మీడియా తో మాట్లాడుతూ.. శాసనసభలో బిఏసీ సమావేశానికి బిజెపి సభ్యులను పిలవకపోవటంపై  ఘాటుగా విమర్శలు చేశారు. కొత్త నిబంధనలు ఉంటే assembly సాక్షిగా మీడియా సమక్షంలో వెల్లడించాలని మంత్రి ప్రశాంత్ రెడ్డిని బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు కోరారు. ఎమ్మెల్యేలు సర్దుకునే లోపే అసెంబ్లీ ప్రారంభం అయ్యింది… వాయిదా పడిందని, బీఏసీ మీటింగ్ కి మమ్మల్ని అహ్వానించక పోవడం పై స్పీకర్ ను పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేశామని రఘునందన్ రావు తెలిపారు.

గతంలో ఒకరు, ఇద్దరు సభ్యులు గా ఉన్న పార్టీ లను bac మీటింగ్ కి పిలిచారని రఘునందన్ రావు గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ పిలిచారని, సభ గౌరవాన్ని పెంచాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. గతంలో ఉన్న సంప్రదాయాలు పాటిస్తారా లేదా అన్న రఘు నందన్ గతంలో స్పీకర్ ను ఉద్దేశించి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడిన రికార్డ్స్ మా దగ్గర ఉన్నాయని వెల్లడించారు. ఈటెల రాజేందర్ వ్యాఖ్యలపై స్పీకర్ ఇచ్చే నోటీస్ లు చట్ట బద్ధంగా ఎదుర్కొనేందుకు సిద్ధమని తెలిపారు. మరమనిషి అనే పదం ఎమైన నిషేధిత పదమా అని రఘునందన్ రావు ప్రశ్నించారు.

Also Read : 12, 13 తేదీలలో శాసనసభ సమావేశాలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్