Friday, November 22, 2024
HomeTrending NewsPolls: సెమి ఫైనల్లో బిజెపి ఘన విజయం

Polls: సెమి ఫైనల్లో బిజెపి ఘన విజయం

ఉత్తరాది రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో బిజెపి స్పష్టమైన ఆధిక్యత దిశగా సాగుతోంది. ఛత్తీస్ గడ్ లో రెండోసారి ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ విపలమైంది. బిజెపి అవసరమైన మెజారిటీ సాధించింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గానూ 54 స్థానాల్లో బీజేపీ లీడింగ్‌లో ఉంది. ఇక 30 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో.. బీజేపీ పార్టీ 105 స్థానాల్లో ఆధిక్యంలో కొన‌సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ 79 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. రాజ‌స్థాన్ అసెంబ్లీలో 199 సీట్లు ఉన్నాయి. అయితే 100 సీట్లు వ‌చ్చిన పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈసారి రెండు పార్టీల‌కు చెందిన రెబ‌ల్స్ ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. దాదాపు 40 మంది రెబ‌ల్స్ రాజ‌స్థాన్ పోరులో నిలిచారు. 2018 ఎన్నిక‌ల్లో బీజేపీ ఓట్ షేర్ 38.77 శాతం, బీజేపీకి 39.30 ఓటు శాతం ఉంది.

జ‌ల్రాప‌త‌న్‌లో వ‌సుంధ‌ర రాజే, స‌ర్దార్‌పురాలో సీఎం గెహ్లాట్ గెలిచారు. జ‌ల్రాప‌త‌న్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌సుంధ‌ర రాజే 2003 నుంచి పోటీ చేస్తున్నారు. ఇక సీఎం గెహ్లాట్ 1998 నుంచి స‌ర్దార్‌పురా నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీలో ఉన్నారు. Tonk  నియోజకవర్గంలో సచిన్ పైలట్ విజయం సాధించారు.
మధ్యప్రదేశ్ లో  మొత్తం 230 స్థానాలకు గాను 159 స్థానాల్లో బిజెపి, కాంగ్రెస్ 67 స్థానాల్లో గెలుపు దిశలో ఉన్నాయి. ఇందులోనూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు దగ్గరగా బీజేపీ లీడ్ కొనసాగిస్తోంది.
సార్వత్రిక ఎన్నికలకు సెమి ఫైనల్ గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు బిజెపి సొంతం చేసుకోవటం కమలనాధుల్లో జోష్ నింపింది. తెలంగాణ రాష్ట్రంలో హస్తం జయకేతనం ఎగురవేసింది. మిజోరంలో ఓట్ల లెక్కింపు ఈ రోజు ఉండగా ఎన్నికల సంఘం వాయిదా వేసింది.
-దేశవేని భాస్కర్
RELATED ARTICLES

Most Popular

న్యూస్