Wednesday, May 8, 2024
HomeTrending Newsబీజేపీ జై శ్రీరామ్ అంటే.. జై హనుమాన్ అంటాం

బీజేపీ జై శ్రీరామ్ అంటే.. జై హనుమాన్ అంటాం

నార్త్ ఇండియాలో మసీదుల్లో దేవుడి ఆలయాలు, విగ్రహాలున్నాయంటూ.. అసలు దేవాలయాలను కూల్చివేసి మసీదులను నిర్మించారంటూ పెద్ద ఎత్తున రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణలో కూడా బీజేపీ నేతలు దేవుడి ప్రస్తావనను తీసుకొస్తున్నారు. రాజకీయాల్లో భగవంతుడి పేరును వాడుతున్నారు. దీనిపై జగిత్యాల వేదికగా ఓ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.

‘బీజేపీ జై శ్రీరామ్ అంటే.. మేము జై హనుమాన్ అంటాం’ అని తేల్చి చెప్పారు. అవసరం అయితే దేవుణ్ణి కూడా ప్రజలు ప్రశ్నిస్తారన్నారు. దేవుడి కంటే భక్తుడే గొప్ప అని.. నాయకుడి కంటే ప్రజలే గొప్ప అని కవిత పేర్కొన్నారు. రాజకీయం మొత్తం దేవుడి చుట్టే తిప్పితే ఊరుకోబోమని హెచ్చరించారు. ఇంట్లో దేవుణ్ణి ఎగ్జిబిషన్ లాగా బయట పెట్టబోమన్నారు. దేవుడి పేరు చెప్పి భయపెడితే భయపడబోమన్నారు. అంతకు ముందు జగిత్యాల జిల్లా కు విచ్చేసిన కల్వకుంట్ల కవితకు గండి హనుమాన్ ఆలయం వద్ద ఘన స్వాగతం పలికిన టీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు,ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ తదితరులు. అనంతరం గండి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Also Read : అమిత్ షాకు ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం

RELATED ARTICLES

Most Popular

న్యూస్