Tuesday, February 25, 2025
HomeTrending Newsబద్వేలు బరిలో ఉంటాం: సోము వీర్రాజు

బద్వేలు బరిలో ఉంటాం: సోము వీర్రాజు

బద్వేలు ఉపఎన్నికలో భారతీయ జనతా పార్టీ, జనసేన ఉమ్మడి అభ్యర్ధి పోటీలో ఉంటారని  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. ఏ పార్టీ అభ్యర్థి బరిలో ఉంటారనేది అతి త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నిక పై జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్, ఆ పార్టీ పొలిటికల్ అఫైర్స్ చైర్మన్  నాదెండ్ల మనోహర్ లతో సోము వీర్రాజు, బిజెపి రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ లు మంగళగిరి లోని జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలను బిజెపి కేంద్ర కమిటీ దృష్టికి తీసుకెళ్ళి వారి సూచన మేరకు  నిర్ణయం తీసుకుంటామని వీర్రాజు చెప్పారు.

అయితే, తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో తాము పోటీ చేయాలనుకున్నప్పటికీ బిజెపి అభ్యర్ధనతో తాము వారికి అవకాశం ఇచ్చాం కాబట్టి బద్వేల్ లో జనసేన తరఫున అభ్యర్థిని పోటీ చేయిద్దామని పవన్ కళ్యాణ్ ప్రతిపాదించినట్లు తెలిసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్