Saturday, March 29, 2025
Homeతెలంగాణఉపరాష్ట్రపతిని కలిసిన డీకే అరుణ

ఉపరాష్ట్రపతిని కలిసిన డీకే అరుణ

దేశ రాజకీయాల్లో ప్రభావశీల వ్యక్తిగా, మహోన్నత వ్యక్తిత్వం కలిగిన నేత భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడని బిజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు. ఆదివారం ఢిల్లీలో డీకే అరుణతో పాటు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ బిజేపీ ఇంచార్జ్ నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి వెంకయ్యనాయుడిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరు ఎం వెంకయ్యనాయుడనీ, సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక హోదాల్లో పని చేసి మెప్పించిన నాయకుడని డీకే అరుణ కొనియాడారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్