తెలంగాణ రాష్ట్రంలో పాగా వేసేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టింది. రాబోయే ఎన్నికలే టార్గెట్ గా పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. బూత్ లెవల్ నుంచి పార్టీని పటిష్టం చేసేందుకు 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు బీజేపీ నాయకత్వం పాలక్ లను నియమించింది. బీజేపీ అధిష్టానం సూచన మేరకు పాలక్ సభ్యులు నెలలో మూడు రోజుల పాటు నియోజకవర్గాల్లోనే ఉండనున్నారు. నియోజకవర్గాల స్థితిగతులపై ఎప్పటికప్పుడు రాష్ట్ర నాయకత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, సీనియర్లను పాలక్ లుగా నియమించారు. ఈ నేపథ్యంలో వీరందరికి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పలు సూచనలు చేశారు.
అసెంబ్లీ పాలక్ లుగా బిజెపి సీనియర్ నేతలు లక్ష్మణ్, డికె అరుణ, కిషన్ రెడ్డి, మురళిధర్ రావు, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, విజయ శాంతి
కుత్బుల్లాపూర్ – డీకే అరుణ
ఎల్లారెడ్డి – రఘునందన్ రావు
రామగుండం – కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి
కల్వకుర్తి – రాం చందర్ రావు
వరంగల్ తూర్పు – ఈటల రాజేందర్
ములుగు – సోయం బాపూ రావు
మేడ్చల్ – లక్ష్మణ్
శేరిలింగంపల్లి – కిషన్ రెడ్డి
పరిగి – విజయశాంతి
కొత్తగా పాలక్ గా బాధ్యతలు తీసుకున్న వారు ప్రతి నెల మూడు రోజులు పాటు వారికి కేటాయించిన నియోజకవర్గంలో పనిచేయాలి. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తల సాధక బాధలన్నీ తెలుసుకుంటూ వారిని ముందుకు నడిపించే బాధ్యత తీసుకోవాలి. అలాగే ఆర్థిక వనరులు, కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను వీరే చూడాల్సి ఉంటుంది. ఈ విధంగా క్షేత్రస్థాయిలోకి బిజెపిని తీసుకు వెళ్లే విధంగా ఆ పార్టీ హైకమాండ్ ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. రాబోయే తెలంగాణ ఎన్నికల వరకు ఏదో ఒక కార్యక్రమంతో నిత్యం జనాల్లో ఉండేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. బిజెపి పెద్దలు తెలంగాణ విషయంలో ప్రతిష్టాత్మకంగా ఉండడంతో పాటు, ఎప్పటికప్పుడు రాష్ట్ర నాయకులకు తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. తరచుగా తెలంగాణ అంతట పర్యటిస్తూ తమ రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గాల వారీగా మరింత దూకుడుగా ముందుకు వెళ్లేందుకు బిజెపి నాయకత్వం భారీగానే ప్లాన్ చేసింది.