Bjp Victory In Huzurabad :
హుజురాబాద్ ఉపఎన్నికలో బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ ఘన విజయం సాధించారు. ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో 8,11 రౌండ్లు మినహా అన్నింటా ఈటెల స్పష్టమైన ఆధిక్యం కనబరిచారు. మొత్తం 22 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే సరికి బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ 24068 ఓట్ల మెజారిటితో గెలుపొందారు. బిజెపి అభ్యర్థికి 1.07.022 ఓట్లు పోలవ్వగా తెరాస అభ్యర్థికి 83167 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్లలో తెరాస అభ్యర్థికే ఎక్కువ ఓట్లు వచ్చాయి. మొత్తం 723 ఓట్లలో తెరాస అభ్యర్థికి 503 రాగా బిజెపికి 159 కాంగ్రెస్ కు 32 ఓట్లు రాగా 14 ఓట్లు చెల్లలేదు.
తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ సొంత గ్రామం హిమ్మత్ నగర్ తో పాటు ముఖ్యమంత్రి కెసిఆర్ దళితబందు ప్రారంభించిన శాలపల్లీ గ్రామంలో కూడా బిజెపి హవా కొనసాగింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకన్నా ముందే హుజురాబాద్ లో మకాం వేసిన మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తో సహా తెరాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెరాస శ్రేణుల్ని భారీగా మోహరించినా ఈటెల రాజేందర్ గెలుపును అడ్డుకోలేకపోయారు.
Must Read :నిరీక్షణకు తెర, విజయం నాదే: ఈటెల