Tuesday, September 24, 2024
HomeTrending Newsకేంద్రమంత్రి కిషన్ రెడ్డికి... మంత్రి కేటిఆర్ సవాల్

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి… మంత్రి కేటిఆర్ సవాల్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష పరోక్ష పన్నుల రూపంలో మూడు లక్షల 68 వేల కోట్ల రూపాయలు కేంద్రానికి చెల్లించామని మంత్రి కేటిఅర్ తెలిపారు. అందులో 1 లక్షా 68 వేల కోట్ల రూపాయలు మాత్రమే కేంద్రం ఇచ్చిందన్నారు. తాను చెప్పేది తప్పయితే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కిషన్ రెడ్డి కి మంత్రి KTR సవాల్ చేశారు. మీరు చెప్పేది తప్పైతే కేంద్ర మంత్రి పదవి వదిలి పెట్టకపోయినా.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోయి లేకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు. సూర్యాపేట జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు కేటిఆర్, జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఆ తర్వాత హుజుర్‌న‌గ‌ర్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బ‌హిరంగ స‌భ‌లో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

జాతీయ పార్టీలు రెండు అబద్ధాలతో, తప్పుడు ప్రచారాలతో ప్రజల వద్దకు వస్తున్నాయని, కెసిఆర్ పాలనలో తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం.. కేంద్రం కంటే భారీగా పెరిగిందని కేటిఆర్ వెల్లడించారు. 14 మంది ప్రధానులు చేసిన అప్పు కంటే… ప్రధానిగా మోడీ చేసిన అప్పు చాలా ఎక్కువన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం అప్పులు చేసిందని, ప్రభుత్వం తెచ్చిన ఆ అప్పు భవిష్యత్తు మీద పెట్టుబడి మాత్రమే అన్నారు. ఆ పెట్టుబడి ద్వారా సంపాదన సృష్టించడమే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మోడీ పాలనలో దేశాన్ని దోచుకున్న వాళ్ళు మాత్రమే బాగుపడ్డారని, టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారినా జెండా, ఎజెండా, మనుషులు, డిఎన్ఏ, మారలేదని కేటిఆర్ స్పష్టం చేశారు.

భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌మాద‌క‌ర‌మైన పార్టీ, దాని ఉచ్చులో యువ‌త ప‌డొద్దు అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు.  కిష‌న్ రెడ్డి లాంటి స‌న్నాసి నోటికి ఏది వ‌స్తే అది మాట్లాడుతున్నాడు. ఆయ‌న మాట్లాడేవ‌న్ని అబద్ధాలు.. నిల‌దీస్తే ఒక్క స‌మాధానం కూడా చెప్ప‌డ‌ని మండిప‌డ్డారు. బీజేపీ వ‌ల్ల కార్పొరేట్ శ‌క్తులు బాగుప‌డ్డాయి. ప్ర‌జ‌లు మాత్రం మ‌రింత అగాధంలోకి వెళ్లారు. భార‌త‌దేశానికి దిక్సూచిలా తెలంగాణ రాష్ట్ర ప‌థ‌కాలు అమ‌ల‌వుతున్నాయ‌ని తెలిపారు. రూ. 30 వేల కోట్ల‌తో దామ‌ర‌చ‌ర్ల‌లో అల్ట్రా మెగా వ‌ప‌ర్ ప్లాంట్‌ను నిర్మిస్తున్న‌ది తెలంగాణ ప్ర‌భుత్వం అని స్ప‌ష్టం చేశారు. కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చే నిధులు రాకపోతే నోరు కూడా మెదపని సన్నాసులు బీజేపీ నాయ‌కులు అని కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టి పబ్భం గడుపుకోవాల‌ని కుట్రలు చేస్తున్నది బీజేపీ అని మండిప‌డ్డారు. బీజేపీ వల్ల ఒక దళితుడిగాని, ఒక గిరిజన వ్య‌క్తిగాని బాగుపడ్డ దాఖలాలు లేవు అని స్ప‌ష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్