Monday, February 24, 2025
HomeTrending Newsత్రిపుర మాజీ సీఎం ఇంటిపై దుండగులు దాడి

త్రిపుర మాజీ సీఎం ఇంటిపై దుండగులు దాడి

త్రిపుర మాజీ సీఎం, బీజేపీ ఎంపీ బిప్లబ్ కుమార్ దేవ్‌ ఇంటిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. గోమతి జిల్లా ఉదయ్‌పూర్‌లోని బిప్లబ్‌ కుమార్ దేవ్‌ ఇంట్లో ఆయన తండ్రి సంవత్సరికంలో భాగంగా ఏటా యజ్ఞయాగాదులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి ఉదయ్‌పూర్‌లోని ఆయన పూర్వీకుల ఇంటికి పూజారుల బృందం చేరుకున్నది. ఉదయ్‌పూర్‌లోని జమ్జురి సమీపంలోని రాజ్ధానగర్ కు రాత్రి పొద్దుపోయిన తర్వాత అక్కడి చేరుకున్న గుర్తుతెలియని వ్యక్తులు వేద పండితులపై దాడికి దిగారు.

వారిని విచక్షణా రహితంగా కొట్టడమే కాకుండా వారి వాహనాలకు నిప్పుపెట్టారు. మాజీ సీఎం ఇంటిపై దాడిచేసి మంటలు అంటించారు. దీంతో ఇళ్లుతోపాటు మరో దుకాణం అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ దాడిపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సీపీఎం పనేనని విమర్శించారు. త్రిపురలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకే సిపిఎం నేతలు విఫల యత్నం చేస్తున్నారని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్