Sunday, November 24, 2024
HomeTrending News75 ఏళ్లలో పేదరికం పెరిగింది - కవిత

75 ఏళ్లలో పేదరికం పెరిగింది – కవిత

నిరుద్యోగం, మతత్వాన్ని సమూలంగా దేశం నుంచి రూపుమాపాలని మ్మెల్సీ కవిత పిలుపు ఇచ్చారు. ప్రపంచానికి దిక్సూచిలా భారతదేశం ఎదగాలనే ఆకాంక్ష వ్యక్తం చేశారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో ఈ రోజు రక్తదాన శిభిరం ఏర్పాటుచేశారు. రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్సీ కవితతో కలిసి ఎంపీ కే కేశవరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత రక్తదానం చేశారు. అనంతరం కవిత మాట్లాడుతూ.. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని చెప్పారు.

దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఏ విధంగా మార్చాలనే అంశంపై దేశ పౌరులందరూ ఆలోచించాలని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. దేశ అభ్యున్నతి కోసం మనమంతా పునరంకితమవ్వాలని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యల్లో పేదరికం ఒకటన్నారు. 75 ఏళ్ల స్వాతంత్రంలో పేదరికం అంతకంతకు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశం బాగుండాలంటే ప్రజలు బాగుండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, హైదరాబాద్‌ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కార్పొరేషన్ చైర్మన్లు మేడే రాజీవ్ సాగర్, గజ్జెల నగేష్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, విప్లవ్ రెడ్డి తదితరుల పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్