Wednesday, May 8, 2024
HomeTrending Newsహైదరాబాద్ కు వస్తున్న ఫార్మ దిగ్గజం బిఎంఎస్

హైదరాబాద్ కు వస్తున్న ఫార్మ దిగ్గజం బిఎంఎస్

తెలంగాణ ప్రభుత్వంతో BMS (Bristol Myers Squibb) ఈ రోజు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. పరిశ్రమల శాఖ మంత్రి కే. తారక రామారావు సమక్షంలో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న కంపెనీ….డ్రగ్ డెవలప్మెంట్, ఐటి మరియు ఇన్నోవేషన్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహించనుంది. సుమారు 100 మిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టనున్న BMS…రానున్న మూడు సంవత్సరాలలో BMS కంపెనీ సుమారు 1500 మంది ఉద్యోగులను నియమించుకోబోతున్నది.

కేటీఆర్ కామెంట్స్

ప్రపంచంలోనే ప్రసిద్ధ టాప్ టెన్ ఫార్మస్యూటికల్ కంపెనీలలో బిఎంఎస్ ఒకటి. తెలంగాణ రాష్ట్రానికి వారిని ఆహ్వానిస్తున్నందుకు సంతోషంగా ఉన్నది. హైదరాబాద్ నగరం బయోటెక్నాలజీ, ఐటికి గొప్ప ఆకర్షనీయ గమ్య స్థానంగా ఉన్నది. బిఎంఎస్ కూడా ఈ రెండు రంగాల్లో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. హైదరాబాద్ నగరం లో ఉన్న మానవ వనరుల నైపుణ్యం వారి కార్యకలాపాలకు ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన ప్రతిభాపాటవాలున్న యువకుల టాలెంట్ పూల్ అందుబాటులో ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఐటీ మరియు టెక్నాలజీకిలో అద్భుతమైన ప్రతిభ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో తయారీ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని బిఎంఎస్ కు విజ్ఞప్తి చేసిన కేటీఆర్….హైదరాబాద్ నగరం బయోటెక్నాలజీ లైఫ్ సైన్సెస్ రంగంలో బలంగా ఎదుగుతూ ఉన్నది.

2028 నాటికి రాష్ట్రంలోని లైఫ్ సైన్సెస్ ఈకో సిస్టం విలువను రెట్టింపు చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఈరోజు బిఎంఎస్ అవగాహన ఒప్పందం ఉన్నదని తెలిపిన కేటీఆర్. లైఫ్ సైన్సెస్ రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ యువతకు ఈ సంస్థ ఏర్పాటు ఒక గొప్ప అవకాశం. MOU ద్వారా 1500 మందిని నియమించుకుంటామన్న బిఎంఎస్ కంపెనీ త్వరలోనే తమ లక్ష్యాన్ని చేరుకొని మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్న నమ్మకం ఉన్నది. ఈరోజు జరిగిన అవగాన ఒప్పందం సందర్భంగా హైదరాబాద్ ఫార్మాసిటీలో ఉన్న అవకాశాల గురించి కంపెనీ ప్రతినిధులకు వివరించగా…ఇప్పటికే హైదరాబాద్ ఫార్మసిటీకి అవసరమైన పర్యావరణ మరియు ఇతర అనుమతులు ఉన్న నేపథ్యంలో అక్కడ తయారీ ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు ఉన్న సౌలభ్యాన్ని వివరించాను.

తమ కంపెనీ ఫార్మస్యూటికల్, బయోటెక్నాలజీ, వైద్యరంగంలో అనేక సేవలను అందిస్తుంది. ఆయా రంగాల్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నదని బిఎంఎస్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, గ్లోబల్ డ్రగ్ డెవలప్మెంట్ విభాగం సమ్మిత్ హిరావత్  వెల్లడించారు. భారత దేశంలో ఈ రంగాల్లో అద్భుతమైన టాలెంట్ పూల్ అందుబాటులో ఉంది. రానున్న మూడు సంవత్సరాలలో కంపెనీ సుమారు 1500 మంది ఉద్యోగులను నియమించుకోబోతున్నది. సుమారు 100 మిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టబోతున్నది. తమ కేంద్రం ఐటి మరియు టెక్నాలజీ, ఇన్నోవేషన్, వైద్య అనుబంధ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహించబోతున్నదని సమ్మిత్ హిరావత్  తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్