బాలీవుడ్ సీనియర్‌ నటుడు దిలీప్‌ కుమార్‌(98) కన్నుమూశారు.  కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబై హిందుజా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. దిలీప్ కుమార్ అసలు పేరు యూసుఫ్ ఖాన్,

1922 డిసెంబర్‌ 1న పాక్‌లోని పెషావర్‌లో దిలీప్ కుమార్ జన్మించారు. దేశ విభజన తరువాత అయన కుటుంబం ఇండియాలోనే స్థిరపడ్డారు. 1944లో విడుదలైన ‘జ్వర్‌ భాతా’  చిత్రంతో మొదటిసారి ఆయన నటుడిగా వెండితెరపై మెరిశారు. 1960లో విడుదలైన ‘మోఘలె ఆజామ్’,  1961 లో ‘గంగా జమునా’ దిలీప్ కు స్టార్ డమ్ తెచ్చిపెట్టాయి. దిలీప్‌కుమార్‌ ఉత్తమ నటుడిగా పలు అవార్డులు  అందుకున్నారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలు గుర్తించిన భారత ప్రభుత్వం 1994లో ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ అవార్డుతో సత్కరించింది. 2015 భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ తో గౌరవించింది. అయన నటించిన చివిరి చిత్రం ‘ఖిలా’ 1998లో విడుదలైంది. గత ఎడా డి కరోనాతో అయన తన ఇద్దరు సోదరులు అస్లాం ఖాన్, ఇషాన్ ఖాన్ లను కోల్పోయారు. బాలీవుడ్ ట్రాజెడీ కింగ్ గా పేరుపొందిన దిలీప్ మరణం భారతీయ సినీ ప్రేక్షకులకు నిజంగా ‘ట్రాజెడి’ అని చెప్పవచ్చు.

దిలీప్ కుమార్ మృతికి రాష్ట్రపతి రాంనాథ్ కోవిడ్, ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ నేత రాహూల్ గాంధీ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత చలన చిత్ర పరిశ్రమ ఓ దిగ్గజ నటుణ్ణి కోల్పోయిందని మోడీ తన సందేశంలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *