Sunday, January 19, 2025
Homeసినిమాఅవును, విడిపోతున్నాం : నాగ చైతన్య, సమంత ప్రకటన

అవును, విడిపోతున్నాం : నాగ చైతన్య, సమంత ప్రకటన

అక్కినేని నాగచైతన్య, సమంత వైవాహిక బంధానికి తెరపడింది. గత మూడు నాలుగు నెలలుగా సామాజిక మధ్యమాల్లో, ప్రచార, ప్రసార సాధనాల్లో వస్తున్నవార్తలకు ఫుల్ స్టాప్  పెడుతూ విడాకుల విషయాన్నిఇద్దరూ  ధ్రువీకరించారు.

“సుదీర్ఘ చర్చలు, అభిప్రాయాలతో  శామ్, నేను భార్యా భర్తల బంధం నుంచీ విడిపోవాలని నిర్ణయించుకున్నాం, ఇకపై మా ఇద్దరి రహదారులూ వేర్వేరుగా ఉండబోతున్నాయి. పదేళ్లుగా మా ఇద్దరి మధ్యా స్నేహం ఉంది, ఇకపై కూడా స్నేహితులుగా ప్రత్యేక బంధం కొనసాగుతుంది” అని నాగ చైతన్య ప్రకటించారు.

“ఇలాంటి క్లిష్ట సమయంలో మా ఇద్దరికీ మద్దతు ఇవ్వాల్సిందిగా మీడియా, అభిమానులు, శ్రేయోభిలాషులను కోరుతున్నాను, మా వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించి మా మా రంగాల్లో మేము ముందుకు సాగేందుకు సహకరించాలి” అని నాగచైతన్య ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. సమంత కూడా పేరు మార్పు  తప్ప ఇదే మ్యాటర్ ను యధాతథంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

పదేళ్ళ క్రితం వచ్చిన ‘ఏం మాయ చేశావే’ సినిమా నుంచి వీరిద్దరి బంధం కొనసాగుతోంది. 2017 అక్టోబర్ 6న ఇద్దరూ ఇరు కుటుంబాల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మూడేళ్ళపాటు వీరి బంధం అన్యోన్యంగా సాగింది. ఈ ఏడాది మొదట్లో ఓ తెలుగు ఒటిటి వేదికగా సమంత నిర్వహించిన  షో లో కూడా ఇద్దరూ కుటుంబ విషయాలపై  ఒకరిపై ఒకరు జోకులేసుకుని సరదాగా గడిపారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ బేధాభిప్రాయాలు మొదలైనట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్