Wednesday, November 27, 2024
HomeTrending Newsప్రజల దృష్టి మళ్ళించేందుకే ఈ కథనాలు : బొత్స

ప్రజల దృష్టి మళ్ళించేందుకే ఈ కథనాలు : బొత్స

తమ ప్రభుత్వం నిన్న ప్రకటించిన వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలనుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకే ఎల్లో మీడియా విష ప్రచారంతో కూడిన కథనాలు నేడు ప్రచురించిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్య నారాయణ మండిపడ్డారు. ఇసుక రీచ్ లు ఎమ్మెల్యేలకు ఇచ్చేస్తున్నారంటూ వచ్చిన వార్తలను అయన ఖండించారు. గత ప్రభుత్వం ఇసుక రీచ్ లను ఎలా దోచుకుందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుకను అందుబాటులోకి తీసుకువచ్చి ఐదేళ్లకు నాలుగు వేల కోట్ల రూపాయలు ఆదాయం తీసుకు వచ్చేలా చర్యలు తీసుకుందన్నారు. టెండర్ ప్రకారం ఒక పని ఒక కంపెనీకి అప్పగించిన తరువాత ఎలాంటి చిన్న లోపాలు ఉన్నా, నిబంధనలు ఉల్లంఘించినా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో లాగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడేలా ఏ చర్యనూ తాము సహించే ప్రసక్తే లేదన్నారు.

కళ్యాణ మస్తు, షాదీ తోఫా పథకాలతో తమ మేనిఫెస్టోలో దాదాపు 99 శాతం అమలు చేసినట్లయ్యిందని చెప్పారు. బాలికా విద్యను ప్రోత్సహించేందుకే ఈ పథకానికి అర్హతా ప్రమాణంగా 10వ తరగతి పాస్ కావాలన్న నిబంధన పెట్టామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన మూడున్నర ఏళ్ళలోపే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత  స్వతంత్రం వచ్చిన తరువాత ఏర్పడిన ప్రభుత్వాల్లో ఒక్క వైఎస్సార్సీపీ కే దక్కుతుందని వెల్లడించాడు.  గత ప్రభుత్వం ఈ కళ్యాణమస్తు పథకాన్ని ప్రవేశపెట్టి మధ్యలోనే నిలిపివేసిందని, బకాయిలు పెట్టిందని వాటిని కూడా తాము చెల్లిస్తూనే గతంలో ఇచ్చిన మొత్తానికి దాదాపు రెట్టింపు ఇవ్వబోతున్నామని బొత్స వివరించారు.

గత ప్రభుత్వం భూ సమీకరణ చట్టానికి అనుగుణంగా రైతులతో చేసుకున్న ఒప్పందం, ఒడంబడిక కంటే మించి రైతులకు మేలు చేసేందుకు తమ ప్రభుత్వం సీఆర్డీఏ చట్టంలో మార్పులు తెస్తే కోర్టుకు వెళ్ళారని గుర్తు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం,. వైజాగ్ లో పర్యటించి ఇక్కడ పరిపాలనా రాజధాని వద్దని యాత్ర ద్వారా చెబితే అక్కడి ప్రజలు అమాయకంగా తలలూపాలని మీ ఉద్దేశమా అని బొత్స నిలదీశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్