Sunday, November 24, 2024
HomeTrending Newsకేసీఆర్ తో గ్యాప్ లేదు - జేడీ(ఎస్)నేత కుమార స్వామి

కేసీఆర్ తో గ్యాప్ లేదు – జేడీ(ఎస్)నేత కుమార స్వామి

బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తో తనకు గ్యాప్ వచ్చిందన్న ఊహాగానాలను కొట్టిపారేసిన కర్ణాటక మాజీ సీఎం, జేడీ(ఎస్)నేత కుమార స్వామి. రాజకీయాల్లో తన తండ్రి దేవేగౌడ తర్వాత అంతటి మార్గదర్శి కేసీఆర్ మాత్రమె అని కుమారస్వామి స్పష్టం చేశారు. కుమార స్వామీ – కెసిఆర్ మధ్య సంబంధాలు చెడ్డాయని  ఇటీవల వస్తున్న ఉహాగానాలపై జేడీ(ఎస్)నేత ఈ రోజు బెంగళూరులో మీడియాతో మాట్లాడారు.
నిన్న రాత్రి రాయచూర్ లో జరిగిన పంచరత్న యాత్రలో నారాయణ పేట బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డితో కలిసి పాల్గొన్న కుమార స్వామి దీనిపై ఇప్పటికే వివరణ ఇచ్చారు. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో 24 జిల్లాల రైతులకు మేలు జరుగుతోందని, మిషన్ భగీరథ పథకంతో తెలంగాణలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగు నీరు లభిస్తోందని కుమార స్వామి అన్నారు. కర్ణాటకలో తాము అధికారం లోకి వస్తే కేసీఆర్ స్ఫూర్తితో పథకాలు అమలు చేస్తామన్న జేడీ (ఎస్)నేత…కాంగ్రెస్, బీజేపీలు కర్ణాటక అభివృద్ధిని వెనక్కు నెట్టాయని ఆరోపించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్