Sunday, November 3, 2024
HomeTrending Newsఅదానీ సంక్షోభంపై జేపీసీ విచార‌ణకు బీఆర్ఎస్ డిమాండ్‌

అదానీ సంక్షోభంపై జేపీసీ విచార‌ణకు బీఆర్ఎస్ డిమాండ్‌

అదానీ సంక్షోభంపై జేపీసీ లేదా సీజేఐతో విచార‌ణ చేప‌ట్టాల‌ని ఇవాళ బీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ నేప‌థ్యంలోనే లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌ల్లో వాయిదా తీర్మానం ఇచ్చిన‌ట్లు వెల్ల‌డించారు. ఆర్థిక అంశం కాబట్టే వాయిదా తీర్మానం ఇచ్చి చర్చ జరగాలని కోరామని పార్లమెంటరీ పార్టీ నేత కేకే అన్నారు. ఢిల్లీలో బీఆర్ఎస్ ఎంపీలు ఇవాళ మీడియాతో మాట్లాడారు. అదాని షేర్లు 27 శాతం పడిపోయాయని ఎంపీ కేకే చెప్పారు. షేర్ల వ్యవహారంపై జేపీసీ లేదా సుప్రీంకోర్టుతో విచారణ జరపాలని ఆయ‌న డిమాండ్‌ చేశారు. వ్యాపారస్తులు ప్రభుత్వ స్నేహితులుగా ఉన్నారని అందుకే కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. సభ ఆర్డర్‌లో లేదని వాయిదా వేయడం సరికాదని ఆయ‌న విమ‌ర్శించారు. లోక్‌సభలో బీఆర్‌ఎస్‌ ఎంపీలు స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టారు. హిడెన్‌బర్గ్‌ రిపోర్టుపై చర్చించాలని డిమాండ్‌ చేశారు. బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం చేశారని బీఆర్ఎస్ నేత‌లు ఆందోళనకు దిగారు. అదాని షేర్ల అంశంపై నోటీసులిచ్చామని, దానిపై చ‌ర్చ చేప‌ట్టాల‌ని స్పీక‌ర్‌ను కోరిన‌ట్లు లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు తెలిపారు.

అదానీ అంశంపై అన్నిపార్టీలు వాయిదా తీర్మానం ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్‌ వ్యాపారస్తుల కోసమే మోదీ ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. అదానీ వ్యవహారం, కేంద్రం తీరుపై దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామన్నారు. అన్ని రాష్ట్రాలను కూడగట్టుకుని పోరాటం చేస్తామన్నారు. జ్యుడీషియల్‌ విచారణ లేదా జేపీసీ వేసి విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్