Sunday, January 19, 2025
Homeసినిమానేర్చుకోవడమే గానీ ఇచ్చే స్థాయి లేదు : బుచ్చిబాబు

నేర్చుకోవడమే గానీ ఇచ్చే స్థాయి లేదు : బుచ్చిబాబు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం పుష్ప‌. ఈ మూవీ సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డంతో పుష్ప 2 పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అయితే.. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా ఉండాల‌నే ఉద్దేశ్యంతో పుష్ప 2 క‌థ పై సుకుమార్ క‌స‌ర‌త్తు చేస్తూనే ఉన్నారు. ఇటీవ‌ల సుకుమార్, ఉప్పెన డైరెక్ట‌ర్ బుచ్చిబాబు క‌థాచ‌ర్చ‌ల్లో ఉన్న ఫోటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. దీంతో పుష్ప 2 స్ర్కిప్ట్ వ‌ర్క్ లో బుచ్చిబాబు కూడా పాల్గొంటున్నాడు అంటూ వార్త‌లు వ‌చ్చాయి.

అయితే.. ప్రచారంలో ఉన్న వార్త‌ల పై బుచ్చిబాబు సోష‌ల్ మీడియాలో స్పందించాడు. ఇంత‌కీ బుచ్చిబాబు ఏమ‌న్నాడంటే.. నేను తరువాత చేయబోయే నా సినిమాకథ డిష్క‌స‌న్స్ సందర్భంలో మా గురువు సుకుమార్ గారితో ఉన్న ఫోటోలు బ‌య‌ట‌కు రావ‌డంతో పుష్ప 2 కి క‌థా చ‌ర్చ‌ల్లో పాల్గొంటున్నాను అంటూ వార్త‌లు వ‌చ్చాయి. సుకుమార్ సార్.. నా కోసం నా సినిమా కథ కోసం హెల్ప్ చేయడానికి వచ్చారు. అంతే కానీ.. సుకుమార్ సార్  సినిమా కథలో కూర్చుని డిస్క‌స్ చేసేంత స్థాయి నాకు లేదు రాదు. ఆయన నుంచి నేర్చుకోవడం తీసుకోవడమే తప్పా, ఆయనకి ఇచ్చేంత లేదు అన్నారు.

Also Read :  పుష్ప 2 కోసం రంగంలోకి మ‌రో డైరెక్ట‌ర్  

RELATED ARTICLES

Most Popular

న్యూస్