Saturday, January 18, 2025
Homeసినిమాచరణ్‌, బుచ్చిబాబు రెమ్యూనరేషన్స్ ఎంతో తెలుసా..?

చరణ్‌, బుచ్చిబాబు రెమ్యూనరేషన్స్ ఎంతో తెలుసా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో భారీ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సినిమా తర్వాత చరణ్‌.. బుచ్చిబాబుతో సినిమా చేయనున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

ఉప్పెన సినిమా చిన్న సినిమాగా రిలీజైంది. ఆతర్వాత 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి పెద్ద సినిమాగా నిలిచింది. దీంతో బుచ్చిబాబుతో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు, స్టార్ ప్రొడ్యూసర్స్ ఇంట్రస్ట్ చూపించారు. అయితే.. బుచ్చిబాబు మాత్రం నెక్ట్స్ మూవీని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేయాలి అనుకున్నారు. ఎన్టీఆర్ కూడా కథ నచ్చడంతో సినిమా చేయాలి అనుకున్నారు కానీ.. ఇంకా కొరటాలతో చేయాల్సిన సినిమా స్టార్ట్ కాకపోవడం.. మరో వైపు ప్రశాంత్ నీల్ తో కూడా సినిమా చేయాల్సి ఉండడంతో బుచ్చిబాబుకు నో చెప్పాడు. ఎన్టీఆర్ నో చెప్పడంతో బుచ్చిబాబు చరణ్‌ కు కథ చెప్పడం.. ఆయన ఓకే అనడంతో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు.

అయితే ఈ ప్రాజెక్టు కోసం నిర్మాతలు దాదాపు 250 కోట్ల నుంచి 300 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్టు సమాచారం. రామ్ చరణ్ కు రెమ్యునరేషన్ దాదాపు 100 కోట్ల వరకు ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తుంది. మరి.. బుచ్చిబాబుకు ఎంత రెమ్యూనరేషన్ అంటే.. 20 కోట్లు ఇవ్వనున్నారని వార్తలు వస్తున్నాయి. రెండో సినిమాకే 20 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ అయ్యింది. మరి.. రెండో సినిమాతో కూడా బుచ్చిబాబు సక్సెస్ సాధిస్తే మూడవ సినిమాకి ఇంకెంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడో అనేది ఆసక్తిగా మారింది.

Also Read : చరణ్‌, బుచ్చిబాబు మూవీ మరింత ఆలస్యం?

RELATED ARTICLES

Most Popular

న్యూస్