Saturday, January 18, 2025
Homeసినిమాబుచ్చిబాబును టెన్ష‌న్ పెడుతున్న ఎన్టీఆర్?

బుచ్చిబాబును టెన్ష‌న్ పెడుతున్న ఎన్టీఆర్?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ త‌ర్వాత కొర‌టాల శివ‌తో సినిమా చేయ‌నున్న‌ట్టుగా ఎప్పుడో ప్ర‌క‌టించారు కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు సెట్స్ పైకి వెళ్ల‌లేదు. ఈ సినిమా త‌ర్వాత ఉప్పెన ద‌ర్శ‌కుడు బుచ్చిబాబుతో ఎన్టీఆర్ సినిమా చేయాలనుకున్నారు. దీనికి సంబంధించి వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి కానీ.. అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ లో నటించాక తారక్ ఇమేజ్ మారింది. దానికి తగ్గట్టుగానే కథలు, దర్శకులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రకంగా చూస్తే అతడు వరుసగా పాన్ ఇండియా దర్శకులతో పని చేయాల్సి ఉంది. కానీ ఇప్పటికే కొరటాలకు .. బుచ్చిబాబుకు కూడా కమిట్ మెంట్లు ఇచ్చేశాడు. మరో వైపు మైత్రి సంస్థ కేజీఎఫ్ దర్శకుడి ద్వారా తారక్ పై  ఒత్తిడి తెస్తోంది.

అందువల్ల ఈ ప్రాజెక్ట్ ని వెంటనే చేయాల్సి ఉంది. పైగా పాన్ ఇండియా వేడిలో ప్రశాంత్ నీల్ తో కలిసి మ్యాజిక్ చేయాలని తారక్ అనుకుంటున్నాడ‌ట‌. ముందు కొరటాలతో సినిమా కానిచ్చేశాక ప్రశాంత్ నీల్ తో సెట్స్ పైకి వెళతాడు. ఆ తర్వాతే బుచ్చిబాబుకు ఛాయిస్ ఉంటుందని తాజాగా టాక్ వినిపిస్తుంది. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త‌లతో బుచ్చిబాబు టెన్ష‌న్ ప‌డుతున్నాడ‌ట‌. బుచ్చిబాబు ఎన్టీఆర్ కోసం ఇంకా చాన్నాళ్లు వెయిట్ చేయాలి. అందుచేత వేరే హీరోతో బుచ్చిబాబు సినిమా చేయాలనుకుంటున్నాడ‌ట‌. దీంతో.. ఎన్టీఆర్, బుచ్చిబాబు మూవీ ఉన్నాట్టా..?  లేనట్టా..? అనేది ఆస‌క్తిగా మారింది. మ‌రి.. త్వ‌ర‌లో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Also Read : పాపం.. బుచ్చిబాబు

RELATED ARTICLES

Most Popular

న్యూస్