Sunday, November 24, 2024
HomeTrending Newsబడ్జెట్ 2023...మహిళల కోసం కొత్త స్కీమ్‌

బడ్జెట్ 2023…మహిళల కోసం కొత్త స్కీమ్‌

కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌డం వ‌రుస‌గా ఇది ఐదోసారి కాగా ఈ దఫా కొన్ని వర్గాలను ఆకర్షించే విధంగా బడ్జెట్ రూపకల్పన చేసినట్టుగా ఉంది. బడ్జెట్లో ప్రస్తావించిన అంశాలు బాగానే ఉన్నాయని కానీ ఎలా అమలు చేస్తారో చూడాల్సి ఉందని ఆర్ధిక వేత్తలు అంటున్నారు.
బడ్జెట్ ప్రవేశపెడుతూ వివిధ అంశాల్ని మంత్రి ప్రస్తావించారు. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్ అని ఈపీఎఫ్ఓ లో సభ్యుల సంఖ్య రెంట్టింపు అయిందన్నారు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని, జీ-20 అధ్యక్ష బాధ్యతలతో భారత్ కీలక ప్రస్థానాన్ని ప్రారంభించిందన్నారు. ప్రపంచ సవాళ్లను భారత్ ఆర్థిక వ్యవస్థ ధీటుగా ఎదుర్కొని నిలబడిందని, భారత్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిని ప్రపంచ దేశాలు గుర్తించాయన్నారు. దేశం వృద్ధిరేటు శరవేగంగా పెరుగుతోందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్డీఏ ప్రభుత్వానికి ఇదే పూర్తిస్థాయి బడ్జెట్ కాగా ఎన్నికలు జరుగబోతున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు కేటాయింపు జరిగినట్టుగా కనిపిస్తోంది. కర్ణాటకలోని వెనుకబడ్డ ప్రాంతాలకు, అక్కడ సాగు రంగానికి రూ.5,300 కోట్లు
* దేశవ్యాప్తంగా కొత్తగా 50 ఎయిర్‌పోర్ట్‌లు, హెలిప్యాడ్‌ల నిర్మాణం
* 5జీ సేవల అభివృద్ధికి 100 ప్రత్యేక ల్యాబ్‌ల ఏర్పాటు
* పీఎం కౌశల్‌ పథకం కింద 4లక్షల మందికి శిక్షణ.
* దేశంలో 50 టూరిస్ట్‌ స్పాట్‌ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు
* దేఖో ఆప్నా దేఖ్‌ పథకం ప్రారంభం
* స్వదేశీ ఉత్పత్తుల అమ్మకానికి దేశవ్యాప్తంగా యూనిటీ మాల్స్‌

మహిళల కోసం కొత్త స్కీమ్‌
ఆజాదీకా అమృత మహోత్సవ్‌లో భాగంగా మహిళల కోసం ప్రత్యేకంగా కేంద్రం కొత్త పథకం తీసుకొచ్చింది. మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ను ప్రవేశపెట్టింది. రెండేళ్ల కాలానికి ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకంలో డిపాజిట్‌పై 7.5 శాతం స్థిర వడ్డీ ఉంటుంది. గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు ఈ పథకంలో డిపాజిట్‌ చేయొచ్చు.

సీనియర్‌ సిటిజన్స్‌ పొదుపు పథకం పరిమితి పెంపు
సీనియర్‌ సిటిజన్స్‌లో పొదుపు పథకంలో భాగంగా డిపాజిట్‌ పరిమితి పెంచుతున్నట్లు బడ్జెట్‌ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ప్రస్తుతం రూ.15లక్షల వరకూ ఉన్న పరిమితిని డబుల్‌ చేసి, రూ.30లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు.

ఆదాయపన్ను పరిమితి రూ.7లక్షలకు పెంపు
ఉద్యోగులకు ఊరటనిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఉన్న రూ.5లక్షల ఆదాయపు పన్ను పరిమితిని రూ.7లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.

ముఖ్య అంశాలు ….

డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగాయి. సమిష్టి ప్రగతి దిశగా భారత్ వేగంగా కదులుతోంది. దేశంలో గత 9ఏళ్లలో తలసరి ఆదాయం రెట్టింపు అయింది. ఆత్మనిర్భర్ భారత్ తో చేనేత వర్గాలకు లబ్ది చేకూరింది. మహిళా సాధికారత దిశగా కృషి చేస్తున్నాం. 102 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ అందించాం. యువత ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం. అనేక స్టార్టప్స్ యూనికార్న్స్ గా ఎదుగుతున్నాయి. కళాకారులు, హస్త కళాకారులకు ప్రత్యేక రాయితీలు ఇస్తున్నాం. ఎంఎస్ఎంఈ లతో కళాకారుల అనుసంధానం, వారి బ్రాండ్ ప్రమోషన్ కు చర్యలు. టూరిజం రంగంలో భారత్ కు అనేక అవకాశాలు ఉన్నాయి. టూరిజం ప్రోత్సాహానికి విస్తృత చర్యలు చేస్తున్నాం. హరిత ఇంధనం కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం. గ్రీన్ గ్రోత్ కోసం అన్ని రకాల చర్యలు, ఉద్యోగ అవకాశాలు.

సప్త రుషుల రీతిలో ఏడు అంశాలకు బడ్జెట్ లో ప్రాధాన్యత ఇచ్చాం. సమిష్టి ప్రగతి దిశగా అనేక చర్యలు చేపడుతున్నాం. రైతులు, మహిళలు, యువత, వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత. గ్రీన్ ఎనర్జీకి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తోంది. రైతుల కోసం కిసాన్ సమ్మాన్ నిధిని మరింత పెంచుతున్నాం. క్లీన్ ప్లాంట్ ప్రోగ్రాంకు 2వేల కోట్లు కేటాయింపు. మత్స్యకారుల అభివృద్ధి కోసం భారీగా నిధుల కేటాయింపు.

చిరు ధాన్యాల ప్రాధాన్యత పెంచేందుకు చర్యలు. సిరిధాన్యాల ఎగుమతిలో భారత్ ది అగ్రస్థానం. జొన్న, రాగి, బార్లీ ఇలా ఎన్నో సిరిధాన్యాలను పండిస్తున్నాం. 11.7 కోట్ల ఉచిత టాయిలెట్స్ నిర్మించి ఇచ్చాం. ఎస్టీ వర్గాలకు రూ.15వేల కోట్ల కేటాయింపు. దళితుల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు. ఏకలవ్య మోడల్ స్కూళ్లలో 38,800 టీచర్ల నియామకం. పీఎం ఆవాస్ యోజనకు 66 శాతం నిధుల పెంపు
81 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను ఏర్పాటు చేస్తాం. పీఎం విశ్వకర్మ యోజన తీసుకొస్తాం. రైల్వేలకు రూ.2.40 లక్షల కోట్ల కేటాయింపు. కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి పెద్దపీట. మౌలిక వసతుల అభివృద్ధికి 33 శాతం అధిక నిధులు. మూలధనం కింద రూ.10 లక్షల కోట్లు. పేద ఖైదీలకు బెయిల్ పొందేందుకు ఆర్థిక సాయం.

దేశవ్యాప్తంగా 157 కొత్త నర్సింగ్ కాలేజీల ఏర్పాటు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన. మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం రూ.15వేల కోట్లు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు. మేక్ ఏ వర్క్ మిషన్ ప్రారంభం. నేషనల్ హైడ్రోజన్ గ్రీన్ మిషన్ కు రూ.19,700 కోట్లు. విద్యుత్ రంగానికి రూ.35వేల కోట్లు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్