ఆంధ్ర ప్రదేశ్ 2023-24 వార్షిక బడ్జెట్ ను రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రిమ్ బుగ్గన రాజేంద్రనాథ్ నేడు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. రూ. 2, 29, 279 కోట్ల తో బడ్జెట్ ను ప్రతిపాదించారు. దీనిలో రెవెన్యూ వ్యయం 2,28,540 కోట్లు కాగా, మూలధన వ్యయం 31, 061 కోట్లు, రెవెన్యూ లోటు 22, 316 కోట్లు, ద్రవ్య లోటు రూ. 54,587 కోట్లుగా ఉంది.
బడ్జెట్ ముఖ్యాంశాలు:
జీఎస్డీపీ లో రెవెన్యూ లోటు : 3.77 శాతం; ద్రవ్య లోటు: 1.54శాతం
(రూపాయలు కొట్లలో)
వ్యవసాయం – 11,589.48
వైఎస్సార్ రైతు భరోసా – 4,020
వైఎస్సార్ పెన్షన్ కానుక – 21,434.72
సెకండరీ ఎడ్యుకేషన్ – 29,690.71
వైద్య, ఆరోగ్యం- 15,882.34
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి – 15,873.83
రవాణా, ఆర్ అండ్ బి –9,118.71
నీటి వనరుల అభివృద్ధి – 11,908
విద్యుత్ – 6,546.21
గ్రామ వార్డు సచివాలయం – 3,858
గడప గడపకూ మన ప్రభుత్వం – 532
పేదలందరికీ ఇళ్ళు –5,600
పరిశ్రమలు- వాణిజ్యం – 2,062
యువజన అభివృద్ధి , పర్యాటకం, సాంస్కృతికం- 1,291
ధరల స్థిరీకరణ – 3,000
వ్యవసాయ యాంత్రీకరణ – 1,212
మనబడి: నాడు-నేడు – 3,500
జగనన్న విద్యా కానుక – 560
జగనన్న విద్యా దీవెన -2,841.64
జగనన్న వసతి దీవెన – 2,200
డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు – 1,000
రైతులకు వడ్డీ లేని రుణాలు – 500
వైఎస్సార్-పిఎం బీమా యోజన – 1,600
జగనన్న చేదోడు- 350
వైఎస్సార్ వాహన మిత్ర – 275
వైఎస్సార్ నేతన్న నేస్తం – 200
వైఎస్సార్ కాపు నేస్తం – 550
వైఎస్సార్ చేయూత – 5,000
వైఎస్సార్ ఆసరా –6,700
జగనన్న అమ్మ ఒడి – 6,500
వైఎస్సార్ మత్స్య కార భరోసా – 125
మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ -50
రైతు కుటుంబాల పరిహారం – 20
జగనన్న లా నేస్తం – 17
ఈబీసీ నేస్తం – 610
జగనన్న తోడు – 35
వైఎస్సార్ బీమా -372
వైఎస్సార్ కళ్యాణ మస్తు – 200
ఎస్సీ కార్పొరేషన్ – 8,384.93
ఎస్టీ కార్పొరేషన్ – 2,428
బీసీ కార్పొరేషన్ – 22,715
ఈబీసీ కార్పొరేషన్ – 6,165
మైనార్టీ కార్పొరేషన్-1,868.25
కాపు కార్పొరేషన్ – 4,887
బ్రాహ్మణ కార్పొరేషన్ – 346.78
క్రిస్టియన్ కార్పొరేషన్- 115.03
స్కిల్ డెవలప్‌మెంట్ రూ.1,166 కోట్లు
మొత్తంగా డీబీటీ స్కీంలకు రూ.54,228.36 కోట్లు
ఎస్సీ కంపోనెంట్ కోసం- 20, 005
ఎస్టీ కాంపొనెంట్ – 6,929
బిసి కాంపొనెంట్ – 38,605