Sunday, January 19, 2025
Homeసినిమాబాలయ్యతో అనుకుంటే చిరుతో కుదిరిందా..?

బాలయ్యతో అనుకుంటే చిరుతో కుదిరిందా..?

బాలకృష్ణ బుల్లితెర పై ఎంట్రీ ఇచ్చి అన్ స్టాపబుల్ అంటూ టాక్ షోతో అదరగొట్టిన విషయం తెలిసిందే. బాలయ్యతో టాక్ షో అనగానే ఎలా ఉంటుందో అనుకున్నారు కానీ.. తనదైన స్టైల్ లో హోస్ట్ గా చేసి అందర్నీ ఆకట్టుకున్నారు. మహేష్‌, ప్రభాస్, పవన్ కళ్యాణ్‌, గోపీచంద్.. ఇలా యంగ్ హీరోలతో టాక్ షోలో సందడి చేసారు బాలయ్య. అయితే.. ఈ టాక్ షో ఇంత సక్సెస్ అవ్వడం వెనుక రైటర్ బి.వి.ఎస్.రవి ఉన్నారు. ఈయనే ఈ టాక్ షో ఇంత ఇంట్రస్టింగ్ గా ఉండడానికి కారణం. ఈ షో కారణంగా బాలయ్య, బి.వి.ఎస్.రవి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది.

దీంతో బాలయ్య కోసం బి.వి.ఎస్.రవి ఓ కథ రెడీ చేశారు. ఈ కథ బాలయ్యకు చెబితే నచ్చిందని.. దర్శకత్వ బాధ్యతలు కూడా రవికే అప్పగించారని వార్తలు వచ్చాయి. త్వరలో బాలయ్య, బి.వి.ఎస్. రవి కాంబో మూవీ గురించి అనౌన్స్ మెంట్ ఉంటుందని టాక్ వినిపించింది. అయితే.. ఏమైందో ఏమో కానీ.. ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. ఇప్పుడు చిరంజీవి కోసం రవి కథ రాశారట. ఈ కథ విని చిరంజీవి ఇంప్రెస్ అయ్యారట. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. అయితే.. ఈ కథకు డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు.

ఈమధ్య చిరంజీవి వరుసగా రీమేక్ సినిమాలు చేశారు. అవి ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. దీంతో ఓరిజినల్ స్టోరీతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట. అందుకనే కొంత మంది రైటర్స్ ని పిలిచి కథ రెడీ చేయమని చెప్పారట. అలా చెప్పడంతోనే రవి స్టోరీ చెప్పడం ఓకే చేయడం జరిగిందట. అయితే.. బి.వి.ఎస్. రవి కథతో చిరు చేసే సినిమాకి డైరెక్టర్ ఎవరు అనేది ప్రకటించలేదు కానీ.. వినాయక్ పేరు వినిపిస్తుంది. వినాయక్ ప్రస్తుతం ఛత్రపతి మూవీ ప్రమోషన్స్ బిజీలో ఉన్నారు. అందుచేత ఛత్రపతి రిలీజ్ తర్వాత ఈ సినిమా పై క్లారిటీ వస్తుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్