ప్రముఖ కవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డా. C. నారాయణ రెడ్డి జయంతి హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సినారె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… డా. C. నారాయణ రెడ్డి తెలంగాణ గర్వించదగ్గ గొప్ప కవి అని అన్నారు. సీఎం కేసీఆర్ కు సినారె రచనలు అంటే ఎంతో ఇష్టం అన్నారు. వారి రచనలు సీఎం కేసీఆర్ ను ఎంతో ప్రభావితం చేసాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించారన్నారు. తెలంగాణ కు చెందిన వైతాళికుల, కవుల, సాహితీ వేత్తల, సామజిక వేత్తల జయంతి, వర్ధంతి లను సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. డా. సినారె జ్ఞాపకార్ధం హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఎంతో విలువైన ప్రాంతంలో సినారె సాహిత్య సారస్వత సదనం నిర్మిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, కాళోజీ పురస్కార గ్రహీత కోట్ల వెంకటేశ్వర రెడ్డి, సాహితీ వేత్త KP అశోక్ కుమార్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.