తెలంగాణాలో రేపటి నుంచి లాక్ డౌన్ అమలు చేస్తూ కేబినేట్ నిర్ణయం తీసుకుంది. తొలుత 10 రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేస్తారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ నిత్యావసరాలు కొనేందుకు ప్రజలకు అనుమతిస్తారు. పూర్తి మార్గదర్శకాలను నేటి సాయంత్రానికి విడుదల చేస్తారు.
వాక్సిన్ కొనుగోలుకోసం గ్లోబల్ టెండర్లకు వెళ్ళాలని ప్రభుత్వం భావిస్తోంది. ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బందులు లేకుండా చూడాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు.
లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ నిబంధనలు మరింత కఠినం చేసే విషయమై నిర్ణయం తీసుకోవాలని, మధ్యాహ్నం లోపు ఏ విషయం తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది. కేబినేట్ ప్రారంభం అయిన వెంటనే లాక్ డౌన్ నిర్ణయం తీసుకుని కోర్టుకు తెలియజేయాలని అడ్వకేట్ జనరల్ ను ఆదేశించారు.