Sunday, February 23, 2025
HomeTrending Newsమీడియా ముసుగులో గంజాయి రవాణ

మీడియా ముసుగులో గంజాయి రవాణ

Cannabis Smuggling With Media Sticker :

రంపచోడవరం పోలీస్ చెక్ పోస్ట్ వద్ద రెండు ద్విచక్ర వాహనాలపై అక్రమంగా తరలిస్తున్న 45 కేజీల గంజాయిని, ఐదుగురు వ్యక్తులను, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని రంపచోడవరం ఎఎస్పి కృష్ణకాంత్ పటేల్ తెలిపారు. సోమవారం రంపచోడవరం లోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రంపచోడవరం ఎఎస్పి కృష్ణకాంత్ పటేల్ మాట్లాడుతూ… విశాఖ జిల్లా దారకొండ నుండి గంజాయి అక్రమ రవాణా అవుతుందని తెలిపారు.

ముందస్తు సమాచారం మేరకు రంపచోడవరం పోలీస్ స్టేషన్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా రెండు ద్విచక్ర వాహనాలు అక్రమంగా తరలిస్తున్న 45 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులను, రెండు ద్విచక్ర వాహనాలను, గంజాయి బాల్స్ ను 45 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గంజాయి రవాణా కి ఉపయోగించిన ద్విచక్రవాహనంపై ప్రెస్ అని ఉందని, దీనిపై విచారించగా అతని వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. నకిలీ విలేకరి గా గుర్తించామని విలేకరి అని చెప్పుకుంటూ గంజాయి అక్రమ రవాణకు పాల్పడుతున్నాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ త్రినాథ్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Also Read : హైదరాబాద్‌లో భారీగా గంజాయి స్వాధీనం

RELATED ARTICLES

Most Popular

న్యూస్