Sunday, January 19, 2025
HomeTrending Newsతెలంగాణలో క్యాపిటల్యాండ్ భారీ పెట్టుబడి

తెలంగాణలో క్యాపిటల్యాండ్ భారీ పెట్టుబడి

తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు కాపిటలాండ్ కంపెనీ ముందుకు వచ్చింది. ఇందుకు సంబంధించి సుమారు 6,200 కోట్ల రూపాయలతో తన పెట్టుబడి ప్రణాళికలను ఈరోజు ప్రకటించింది. ఈ 6,200 కోట్ల రూపాయల పెట్టుబడిలో…. ఒక డేటా సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు హైదరాబాద్ నగరంలో ఉన్న తన కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు తెలిపింది. 1,200 కోట్ల (S$210 మిలియన్లు) పెట్టుబడితో హైదరాబాద్ మాదాపూర్‌లోని CLINT ఇంటర్నేషనల్ టెక్ పార్క్ లో క్యాపిటల్యాండ్ ఇండియా ట్రస్ట్ ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుంది. 250,000 చదరపు అడుగుల విస్తీర్ణం, 36 మెగావాట్ల (MW) విద్యుత్ సామర్థ్యం కలిగి ఉండే ఈ ITPH డేటా సెంటర్‌ను 5 సంవత్సరాల తరువాత పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో తమకున్న సుమారు 6 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ విస్తీర్ణాన్ని రెట్టింపు చేసేందుకు రానున్న ఐదు సంవత్సరాలలో మరో ఐదు వేల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది.

క్యాపిట ల్యాండ్ ఇండియా ట్రస్ట్ (CLINT)తో కలిసి తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్న డేటా సెంటర్ ఎంఓయూ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీ శాఖ మంత్రి కే. తారకరామారావు.. తెలంగాణలో క్యాపిటల్యాండ్ పెట్టుబడులు పెడుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ లో రోజురోజుకు డెవలప్ అవుతున్న IT పరిశ్రమ అవసరాలు ఈ డేటా సెంటర్ తో తీరుతాయన్నారు. ఇంతేకాకుండా ఇతర IT/ITeS మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల విషయంలోనూ క్యాపిటల్యాండ్ తో కలిసి తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు కేటీఆర్.

సుమారు 1,200 కోట్ల (S$210 మిలియన్లు) పెట్టుబడితో హైదరాబాద్ మాదాపూర్‌లోని CLINT ఇంటర్నేషనల్ టెక్ పార్క్ లో క్యాపిటల్యాండ్ ఇండియా ట్రస్ట్ ఈ డేటా సెంటర్ ఏర్పాటుచేస్తుంది. 250,000 చదరపు అడుగుల విస్తీర్ణం, 36 మెగావాట్ల (MW) విద్యుత్ సామర్థ్యం కలిగి ఉండే ఈ ITPH డేటా సెంటర్‌ను 5 సంవత్సరాల తరువాత పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని CLINT చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంజీవ్ దాస్‌గుప్తా తెలిపారు. నవీ ముంబై కి చెందిన గ్రీన్‌ఫీల్డ్ డేటా సెంటర్ డెవలప్‌మెంట్ సైట్‌ను కొనుగోలుతో 2021 లో ఇండియన్ డేటా సెంటర్ మార్కెట్‌లోకి తమ కంపెనీ ప్రవేశించిందన్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఏర్పాటుచేస్తున్న డేటా సెంటర్ రెండవదన్నారు.

ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనుకున్న తమ ప్రణాళికలో భాగంగా క్యాపిటాల్యాండ్ ఇండియా ట్రస్ట్‌తో కలిసి ఇండియాలో రెండవ డేటా సెంటర్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినందుకు సంతోషంగా ఉందన్నారు క్యాపిటల్ ల్యాండ్ ప్రైవేట్ ఈక్విటీ ఆల్టర్నేటివ్ అసెట్స్, రియల్ అసెట్స్ సీఈఓ పాట్రిక్ బూకాక్. హైదరాబాద్ లో ఏర్పాటుచేయబోయే డేటా సెంటర్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉంటుందన్నారు. డేటా రంగంలో ఇండియాలో నెంబర్ వన్ గా నిలవాలన్న తమ ఆకాంక్షలకు అనుగుణంగా హైదరాబాద్ సెంటర్ ఉంటుదన్నారు. ఎంఓయూ కార్యక్రమంలో వాణిజ్య శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్