Monday, February 24, 2025
HomeTrending Newsసి.బి.ఐ. మాజీ డైరెక్టర్ కె.వి.ఆర్ మృతి పట్ల కెసిఆర్ సంతాపం

సి.బి.ఐ. మాజీ డైరెక్టర్ కె.వి.ఆర్ మృతి పట్ల కెసిఆర్ సంతాపం

సి.బి.ఐ. మాజీ డైరెక్టర్, ఉమ్మడి రాష్ట్రంలో కేబినెట్ మంత్రిగా పనిచేసిన కె.విజయరామారావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వారి మరణం పట్ల సిఎం కేసీఆర్ తన సంతాపాన్ని ప్రకటించారు. ప్రభుత్వ అధికారిగా, ప్రజా ప్రతినిధిగా విజయరామారావు అందించిన ప్రజా సేవలు గొప్పవని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అనంతరం తెలంగాణ రాష్ట్రంలో విజయరామారావుతో తనకున్నఅనుబంధాన్ని ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ స్మరించుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని సిఎం ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు సిఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
దివంగతులైన మాజీ మంత్రి విజయరామారావు అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సిఎం నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సిఎం కేసీఆర్ ఆదేశించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్