Saturday, January 18, 2025
Homeసినిమాఆ విషయంలో కృతి శెట్టిని మెచ్చుకోవలసిందే: చైతూ

ఆ విషయంలో కృతి శెట్టిని మెచ్చుకోవలసిందే: చైతూ

సుధీర్ బాబు – కృతి శెట్టి జంటగా నటించిన ‘ఆ ఆమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా, ఈ నెల 16వ తేదీన  థియేటర్లలో దిగిపోనుంది. బెంచ్ మార్క్ – మైత్రీ వారు కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా, నిన్నరాత్రి  ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది. ఈ ఈవెంట్ కి వచ్చిన నాగచైతన్య మాట్లాడుతూ .. “ఇంద్రగంటి గారి వర్కింగ్ స్టైల్ గురించి నాకు చాలామంది చెప్పారు. ఒక సినిమా మొదలుపెట్టడానికి ముందు ఆయన ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారనేది విన్నాను.

సాధారణంగా ఒక సినిమాను సహజత్వానికి దగ్గరగా తీయాలంటే కొన్ని పరిమితులు ఉంటాయి .. అలా తీయడం వలన రీచ్ కూడా తక్కువగా ఉంటుంది. ఒక రియలిస్టిక్ పాయింట్ ను తీసుకుని ఆయన చాలా కమర్షియల్ గా ప్రెజెంట్ చేస్తారు. సినిమా చూస్తున్నంత సేపు నెక్స్ట్ ఏం జరగబోతుందా అనే అనిపిస్తూ ఉంటుంది. సుధీర్ .. నేను ‘ఏ మాయ చేశావే’లో కలిసి నటించాం. ఫిట్ నెస్ విషయంలో తాను చాలా కేర్ తీసుకుంటాడు. ఎప్పుడు  ఏ సినిమాకి పిలిచినా సిక్స్  ప్యాక్  తో రెడీగా ఉంటాడు. ఆయనలోని అంకితభావం నాకు బాగా నచ్చుతుంది.

ఇక కృతి విషయానికి వస్తే .. మొన్న వెంకట్ ప్రభుగారి సినిమా రిహార్సల్స్ కి నేను .. కృతి వెళ్లాము. తన కేరక్టర్ తో పాటు నా కేరక్టరైజేషన్ కూడా తాను ఒక డైరీలో రాసుకుంది. తన పాత్రకి సంబంధించిన సందేహాలను క్లియర్ చేసుకుంది. నన్ను కూడా కొన్ని డౌట్స్ అడిగితే ఏదో చెప్పి కవర్ చేశాను. కానీ ఇంటికి వెళ్లిన తరువాత నా కేరక్టర్ ను గురించి నేను ఆలోచన చేశాను. ఆమె అంకితభావం నిజంగా నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంత తక్కువ సమయంలోనే ఆమె అంతటి పట్టు సాధిస్తూ ఉండటం నిజంగా అభినందించదగిన విషయం. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని బలంగా నమ్ముతున్నాను”  అంటూ చెప్పుకొచ్చాడు.

Also Read: హీరోయిన్స్ అంతా ఇలా చేస్తే బాగుంటుందేమో: హరీశ్ శంకర్  

RELATED ARTICLES

Most Popular

న్యూస్