పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల పెరుగుదలకు నిరసనగా ఈనెల 28న ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. పార్టీ ముఖ్య నేతలతో అయన సమావేశమయ్యారు. కరోనా కష్ట కాలంలోనీ పన్నులు, ధరలు పెండి ప్రజలపై అదనపు భారం మోపుతున్నారని అయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పెండింగ్ బిల్లులు 413 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల అకౌంట్లలో డిపాజిట్ చేశామని ప్రభుత్వం స్వయంగా హైకోర్టుకు తెలియజేసిందని.. కానీ ఇంతవరకూ ఒక్క రూపాయి కూడా జమ కాలేదని అయన వెల్లడించారు. ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన షుమారు 2 వేల కోట్ల రూపాయలను దారి మళ్ళించారన్నారు. అగ్రి గోల్డ్ బాధితులకు మొత్తం సొమ్ముని వెనక్కు ఇవ్వాలని అయన డిమాండ్ చేశారు. అగ్రి గోల్డ్ తక్కువ రేటుకే తెగనమ్మవద్దని ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వ అవినీతి, దుబారా వ్యయం వల్ల రాష్ట్రంలో ఆర్ధిక సంక్షోభం ఏర్పడిందని పేర్కొన్నారు. దశలవారీ మద్య నిషేధం అమలు చేతామని హామీ ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు మాట పట్టారని విమర్శించారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం దుర్వినియాగం, రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడుల వివరాలని జాతీయ ఎస్సీ కమిషన్ కు నివేదిస్తామని బాబు వెల్లడించారు.