గోదావరి వరద ముంపుతో పోలవరం నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. వారికి పునారావాసం కల్పించడంలో ప్రభుత్వం విఫమిందని ఆరోపించారు,. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై రాజీనామా చేసేందుకు తమ పార్టీ ఎంపీలు సిద్ధంగా ఉన్నారని, వైసీపీ ఎంపీలు సిద్ధంగా ఉన్నారా అంటూ బాబు సవాల్ విసిరారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభుత్వాలు పన్నులు తగ్గించుకోవాలని అయన సూచించారు. అమరావతిలో పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రజా సమస్యలపై పోరాట కార్యాచరణపై చంర్చించారు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని నాయకులకు సూచించారు. నాడు ప్రజావేదిక, నేడు ఐకానిక్ బ్రిడ్జి కూల్చివేయడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో వాచ్ మెన్ రంగన్నకు సిబిఐ అధికారులు రక్షణ కల్పించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. నాడు ప్రతిపక్ష నేతగా ఉండగా వివేకా హత్యపై సిబిఐ విచారణకు డిమాండ్ చేసిన జగన్, తీరా అధికారంలోకి వచ్చాక విచారణ అవసరం లేదంటున్నారని బాబు వ్యాఖ్యానించారు.