Durgamma-Babu: ప్రజల తరఫున పోరాడే శక్తిని ప్రసాదించాలని దుర్గమ్మను వేడుకున్నానని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. నేడు తన 73వ జన్మదినం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామిని పార్టీ నేతలతో కలిసి చంద్రబాబు దర్శించుకున్నారు.
ప్రజల పక్షాన నిలబడి వారికుండే ఇబ్బందులు తొలగించే తెలివితేటలు ఇవ్వాలని…. తాత్కాలికంగా ఉండే ఇబ్బందులను తొలగించి, దీర్ఘకాలంలో తెలుగు జాతికి మళ్ళీ పూర్వవైభవం వచ్చే విధంగా చూడాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు. తెలుగు జాతి సేవకు పునరంకితం అయ్యేందుకు, , ప్రజలకోసం రాజీ లేని పోరాటం చేసేందుకు కావాల్సిన శక్తి ఇవ్వాలని దుర్గమ్మను ప్రార్ధించినట్లు చెప్పారు.
ప్రజల ఆశీస్సులు, ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తూ తెలుగుదేశం పార్టీని నడిపిస్తానని బాబు భరోసా ఇచ్చారు. చంద్రబాబు వెంట పార్టీ ఎంపీలు కేశినేని నాని, కనకమేడల రవీంద్ర కుమార్, పార్టీ రాష్ట్ర అధ్యక్షడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు దేవినేని ఉమా, నెట్టెం రఘురాం తదితరులు ఉన్నారు.
చంద్రబాబుకు దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలకాగా, పండితులు వేదం ఆశీర్వచనం ఇచ్చారు. ఈవో భ్రమరాంభ ప్రసాదాలు అందజేశారు.
Also Read : మహానాడు వరకూ ‘బాడుడే బాదుడు’: చంద్రబాబు