Saturday, November 23, 2024
HomeTrending Newsచార్ ధామ్ యాత్ర భక్తులకు తీపికబురు

చార్ ధామ్ యాత్ర భక్తులకు తీపికబురు

చార్ ధామ్ యాత్రకు వచ్చే భక్తులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. యాత్రకు వచ్చే భక్తుల సంఖ్యను పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి ప్రకటించారు. ప్రతిరోజు గంగోత్రి, యమునోత్రి, భద్రినాథ్, కేదారినాథ్ మందిరాలకు ప్రతి రోజు మరో వెయ్యి మంది భక్తులు అదనంగా వెళ్ళొచ్చని ముఖ్యమంత్రి వివరించారు. ఈ నెల 3వ తేదిన చార్ ధామ్ యాత్ర ప్రారంభం కాగా బద్రీనాథ్ కు 15 వేల మంది భక్తులను కేదారనాథ్ కు 16 వేలమంది భక్తులను దైవదర్శనానికి అనుమతిస్తున్నారు. గంగోత్రికి ఏడువేల మంది యమునోత్రికి 5 వేల మందిని వదులుతున్నారు. ఇటీవల భక్తుల నుంచి విజ్ఞప్తులు పెరగటంతో అదనంగా మరో వెయ్యి మంది వెళ్లేందుకు ఉత్తరఖండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్న వారు చార్ ధామ్ యాత్రకు వెళ్లే ముందు వైద్యుల సూచనలు తీసుకోవడం మంచిది. మే 3న యాత్ర ఆరంభం కాగా, మొదటి ఆరు రోజుల్లోనే 16 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్న వారేనని అధికార వర్గాలు వెల్లడించాయి.
సముద్ర మట్టానికి 10,000 నుంచి 12,000 అడుగుల ఎత్తులోని మందిరాలను దర్శించే క్రమంలో కొందరు భక్తులు ప్రమాదం కొనితెచ్చుకుంటున్నారు. కరోనా ముందు మాదిరిగా కాకుండా.. ఆరోగ్యపరమైన ఫిట్ నెస్ సర్టిఫికెట్ తీసుకురావాలని ఈ విడత ఉత్తరాఖండ్ అధికార యంత్రాంగం అడగడం లేదు.
దీనిపై ఉత్తరాఖండ్ ఆరోగ్య మంత్రి ధన్ సింగ్ రావత్ స్పందిస్తూ.. నాలుగు ధామాల వద్ద చక్కని ఆరోగ్య సదుపాయాలు కల్పించినట్టు చెప్పారు. హెల్త్ సర్టిఫికెట్ లు కూడా తీసుకురావాలని త్వరలో భక్తులను కోరనున్నట్టు తెలిపారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్ నాథ్, బద్రినాథ్, గంగోత్రి, యుమునోత్రితో కూడినదే చార్ ధామ్ యాత్ర.

Also Read : మే 3 నుంచి చార్ ధామ్ యాత్ర‌ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్