Sunday, January 19, 2025
Homeసినిమాసమ్మర్ లో.. ఫ్యాన్స్ కి పండగే

సమ్మర్ లో.. ఫ్యాన్స్ కి పండగే

సమ్మర్ లో ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు పాన్ ఇండియా హీరోలు రెండు వారాల గ్యాప్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆ నలుగురు ఎవరో కాదు చరణ్‌, ఎన్టీఆర్, బన్నీ, ప్రభాస్. ఇంతకీ విషయం ఏంటంటే… చరణ్, శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇండియన్ 2 కారణంగా ఆలస్యం అవుతుంది. తాజా సమాచారం ప్రకారం.. గేమ్ ఛేంజర్ మూవీని మార్చి మూడోవారంలో రిలీజ్ చేయనున్నారు.

ఇక గేమ్ ఛేంజర్ రిలీజ్ అయిన వారం లేదా రెండు వారాలకు ఏప్రిల్ 5న ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుథ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో ఎన్టీఆర్ కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంటే.. విలన్ గా హీరో సైఫ్ ఆలీఖాన్ నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని షూటింగ్ స్టార్ట్ చేయకుండానే ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దేవర సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక దేవర తర్వాత అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ కానుంది. పుష్ప సినిమా నార్త్ లో సంచలనం సృష్టించింది. దీంతో పుష్ప 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేస్తే.. తక్కువ టైమ్ లోనే 100 మిలియన్స్ కు పైగా వ్యూస్ తో దూసుకెళుతుంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ లేదా సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. సమ్మర్ లో రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ మూవీ తర్వాత ప్రభాస్ కల్కి మూవీ రిలీజ్ కానుంది. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ మూవీ కల్కి పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ అనుకున్నారు కానీ.. మే 9న విడుదల చేయనున్నట్టుగా టాక్. ఇలా వచ్చే సమ్మర్ లో చరణ్‌ గేమ్ ఛేంజర్, ఎన్టీఆర్ దేవర, బన్నీ పుష్ప 2, ప్రభాస్ కల్కి చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఈ నలుగురు హీరోల ఫ్యాన్స్ కి పండగే..!

RELATED ARTICLES

Most Popular

న్యూస్