Sunday, September 8, 2024
Homeసినిమాచరణ్‌ 'గేమ్ ఛేంజర్' రిలీజ్ ఎప్పుడు..?

చరణ్‌ ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ ఎప్పుడు..?

ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్‌ గ్లోబల్ స్టార్ అయ్యారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆర్ఆర్ఆర్ ఏ స్థాయి విజయాన్ని సాధించిందో. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డ్ దక్కించుకోవడంతో హాలీవుడ్ లో మన టాలీవుడ్ స్టార్స్ చరణ్‌, ఎన్టీఆర్ లకు బాగా క్రేజ్ పెరిగింది. దీంతో ఆర్ఆర్ఆర్ తర్వాత చేస్తున్న సినిమాల పై మరింతగా క్రేజ్ ఏర్పడింది. చరణ్‌ ప్రస్తుతం శంకర్ తో ‘గేమ్ ఛేంజర్’ సినిమా చేస్తున్నారు. ఈ భారీ పాన్ ఇండియా మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్‌ కు జంటగా కైరా అద్వానీ నటిస్తుంది.

శ్రీకాంత్, అంజలి, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్.జె.సూర్య విలన్ గా నటిస్తున్నారు. అయితే.. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ అండ్ సెకండ్ షెడ్యూల్ చాలా ఫాస్ట్ గా జరిగాయి కానీ.. ఆతర్వాత నుంచి చాలా స్లో అయ్యింది. కారణం ఊహించని విధంగా ఇండియన్ 2 షూటింగ్ కంప్లీట్ చేయాల్సివచ్చింది. దీంతో గేమ్ ఛేంజర్ షూటింగ్ కి బ్రేక్ పడింది. ఓ నెల ఇండియన్ 2 షూటింగ్ చేస్తే.. మరో నెల గేమ్ ఛేంజర్ షూటింగ్ చేస్తున్నారు. ఇలా శంకర్ ఒకేసారి రెండు సినిమాలు చేస్తుండడం వలన గేమ్ ఛేంజర్ బాగా ఆలస్యం అయ్యింది. అలాగే ఈ సినిమా బడ్జెట్ కూడా బాగా పెరుగుతుంది.

అయితే.. గేమ్ ఛేంజర్ రిలీజ్ ఎప్పుడు అనేది ప్రకటించలేదు. దసరాకి విడుదల చేయాలి అనుకున్నారు కానీ కుదరలేదు. ఆతర్వాత డిసెంబర్ లో గేమ్ ఛేంజర్ విడుదల అంటూ ప్రచారం జరిగింది కానీ.. ఇప్పట్లో గేమ్ ఛేంజర్ రాదని టాక్ వచ్చింది. కారణం ఏంటంటే.. ముందుగా ఇండియన్ 2 రిలీజ్ చేసి ఆతర్వాత గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ చేయాలి అనుకుంటున్నాటర శంకర్. తాజా సమాచారం ప్రకారం.. గేమ్ ఛేంజర్ మూవీని మార్చి మూడోవారంలో లేదా నాలుగో వారంలో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట. దిల్ రాజు ఈ చిత్రం కోసం సెకండ్ యూనిట్ ని పెట్టి కొన్ని సీన్స్ ను చిత్రీకరించే ఏర్పాటు చేశారు. అందుచేత శంకర్ లేకపోయినా షూటింగ్ ఆగడం లేదు. మరి.. ప్రచారంలో ఉన్న వార్తల పై దిల్ రాజు క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్