అమెరికాలోని చికాగోలో ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడు వల్ల 8 మంది గాయపడ్డారు. దాంట్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని చికాగో ఫైర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.
నగరంలోని సౌత్ ఆస్టిన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అయితే నివాస ప్రాంతంలో ఏ కారణం చేత పేలుడు జరిగిందో ఇంకా స్పష్టంగా తెలియదు. ఆరుగురు పురుషులు, ఇద్దరు మహిళల్ని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. బిల్డింగ్ పేలిన ప్రదేశం సమీపంలో ఉన్న బిల్డింగ్ నుంచి జనాల్ని ఖాళీ చేయించారు. బిల్డింగ్‌లోని ఫోర్త్ ఫ్లోర్ పూర్తిగా కూలిపోయింది.
Also Read: అమెరికాలో కాల్పులు.. ఆరుగురు మృతి