Monday, January 20, 2025
HomeTrending NewsSecretariat: సచివాలయం ప్రారంభానికి ముమ్మరంగా ఏర్పాట్లు

Secretariat: సచివాలయం ప్రారంభానికి ముమ్మరంగా ఏర్పాట్లు

తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మరో నాలుగు రోజులే ఉండటంతో 24 గంటలు కార్మికులు పనిచేస్తున్నారు. ఆ రోజు నిర్వహించే కార్యక్రమ వివరాలను ప్రభుత్వం ప్రకటించింది.  ఈనెల 30న సూర్యోదయం [ఉ. 6 గంటల] తరవాత బిఆర్ అంబేద్కర్  సచివాలయంలో సుదర్శన యాగం ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 1 గంట 20 నుంచి 1 గంట 30 నిమిషాల మధ్య యాగం పూర్ణాహుతి తరవాత సమీకృత కొత్త సచివాలయంను ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభిస్తారు. ఆ వెంటనే 6 వ అంతస్తులోని తన ఛాంబర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కొలువుదీరుతారు.

మధ్యాహ్నం 1 గంట 58 నిమిషాల నుంచి 2 గంటల 04 నిమిషాల మధ్యకాలంలో తమ ఛాంబర్లలో వివిధ శాఖల మంత్రులు కొలువుదీరుతారు. మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు కొత్త సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో వివిధ వర్గాలకు చెందినవారు పాల్గొంటారు. వారిని ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగిస్టారు. ఆ తరవాత తమతమ స్థానాల్లో అధికారగణం, ఇతర ప్రభుత్వ యంత్రాంగం కొలువుదీరుతుంది. ఏప్రిల్ 30 వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో సమీకృత కొత్త పరిపాలనా సౌధం అందుబాటులోకి రానుంది. ఆ రోజు నుంచి సీఎం, సీఎంఓ అధికార యంత్రాంగం, మంత్రులు అక్కడే పూర్తిస్థాయిలో విధులు నిర్వర్తించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్