Sunday, January 19, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్పరువు నష్టం దావా వేస్తా: విజయ్

పరువు నష్టం దావా వేస్తా: విజయ్

హిందూపురం వైఎస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోను తాను మార్ఫింగ్ చేసినట్లు మాధవ్ చేసిన ఆరోపణను టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, తీవ్రంగా ఖండించారు. రాసలీలల వీడియో బయటకు వచ్చిన వెంటనే బేషరతుగా గోరంట్ల రాజీనామా చేయాలని,  వీడియోలో ఉన్నది తాను కాదని తెలితేనే అప్పుడు మళ్లీ పదవి చేపట్టాలని సూచించారు.

జుగుప్సాకరమైన వీడియో తో మాధవ్ ఏపీ పరువు తీశాడని విజయ్ దుయ్యబట్టారు. ఈ వీడియో తాను చేసిన కుట్ర అంటూ ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. తానూ పనిగట్టుకుని కుట్ర చేసేంత సీన్ మాధవ్ కి లేదని ఎద్దేవా చేశారు. రాయలసీమకు చెందిన ఓ ఎంపీ వ్యక్తిగత వీడియోలకు తనకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఫోరెన్సిక్ కి ఇస్తానని చెబుతున్న మాధవ్, తక్షణమే కేంద్ర ఫోరెన్సిక్ విభాగం తో ఈ పనిచేయించాలని హితవు పలికారు.

మాధవ్ వెంటనే తన పేరు ప్రస్తావించినందుకు క్షమాపణ చెప్పాలని, లేకుంటే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు.  25మంది ఎంపీలు ఇస్తే, ప్రత్యేక హోదా తెస్తానని జగన్మోహన్ రెడ్డి ఆంటే, మాధవ్ లైవ్ లో ప్రత్యేక వీడియోలు పెడుతున్నాడని ఘాటుగా వ్యాఖ్యానించారు. కియా సంస్థనే బెదిరించిన చరిత్ర మాధవ్ కు ఉందన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్