Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్BWF Rankings: సేన్ కు ఆరు, సాత్విక్-చిరాగ్ జోడీకి ఏడు

BWF Rankings: సేన్ కు ఆరు, సాత్విక్-చిరాగ్ జోడీకి ఏడు

బాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బిడబ్ల్యూఎఫ్) వరల్డ్ తాజా ర్యాంకింగ్స్ లో భారత పురుషుల డబుల్స్ జోడీ సత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ తమ కెరీర్ లోనే అత్యుత్తమ ఏడో ర్యాంక్ ను తిరిగి చేజిక్కించుకున్నారు. నేడు ఈ ర్యాంకింగ్స్ జాబితా విడుదలైంది.

ఇటీవలి ఫ్రెంచ్ ఓపెన్-2022లో ఈ జోడీ మొదటి స్థానంలో నిలిచి BWF సూపర్ 750 తొలి టోర్నీని తమ ఖాతాలో వేసుకున్నారు. అంతకుముందు కామన్ వెల్త్ గేమ్స్ లో కూడా వీరు గోల్డ్ మెడల్ సాధించిన సంగతి తెలిసిందే.

కాగా, పురుషుల సింగిల్స్ లో లక్ష్య సేన్ రెండు స్థానాలు ఎగబాకి ఆరో ప్లేస్ లో నిలిచాడు. కిడాంబి శ్రీకాంత్, హెచ్ ఎస్ ప్రన్నోయ్ లు గత ర్యాంకింగ్స్ 11,12 స్థానాలు నిలబెట్టుకున్నారు. గాయం కారణంగా గత మూడు టోర్నమెంట్లకు దూరంగా ఉన్న పివి సింధు ఒక స్థానం ఎగబాకి ఐదో ప్లేస్ చేరుకుంది.

మహిళల డబుల్స్ లో గాయత్రి గోపీచంద్- త్రెసా జాలీ ఐదు స్థానాలు ఎగబాకి తమ కెరీర్ లోనే అత్యుత్తమంగా 23వ ర్యాంక్ లో నిలిచారు. మిక్స్డ్ డబుల్స్ లో ఇషాన్ భట్నాగర్-తానీషా క్రిస్టో రెండు స్థానాలు మెరుగు పరచుకొని 28వ ర్యాంక్  సాధించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్