కామన్ వెల్త్ గేమ్స్, బ్యాడ్మింటన్ లో నేడు ఇండియాకు పసిడి పంట పండింది. మహిళలు, పురుషుల సింగల్స్ లో పివి సింధు, లక్ష్య సేన్ స్వర్ణ పతకాలతో సత్తా చాటగా, పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి – చిరాగ్ శెట్టి జోడీ ఫైనల్లో గెలుపొంది ముచ్చటగా మూడో గోల్డ్ సాధించారు. ఫైనల్లో ఇంగ్లాండ్ ద్వయం బెన్ లేన్- సీన్ వెండీ పై 21-15; 21-17 తో విజయం సాధించారు.
సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీ 2018 కామన్ వెల్త్ గేమ్స్ లో రెండో స్థానంలో నిలిచారు. ఈసారి స్వర్ణం గెల్చుకొని రికార్డు సృష్టించారు.
Also Read : Badminton: నెరవేరిన బంగారు ‘లక్ష్యం’