మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ‘ఆటోజానీ’ అనే సినిమా ప్లాన్ చేశారు. ఈ సినిమానే చిరంజీవి 150వ సినిమాగా చేయాలి అనుకున్నారు. రామ్ చరణ్ ఈ క్రేజీ కాంబో మూవీని ప్రకటించడం కూడా జరిగింది. అయితే.. ఏమైందో ఏమో కానీ.. లాస్ట్ మినిట్ లో ఈ సినిమా క్యాన్సిల్ అయ్యింది. ఈ క్రేజీ కాంబోలో మూవీని చూడాలని మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు సెట్ కాలేదు.
అయితే.. ‘గాడ్ ఫాదర్‘ మూవీలో చిరంజీవి.. పూరి జగన్నాథ్ తో ఓ క్యారెక్ట్ చేయించడం.. ఆ క్యారెక్టర్ కు అనూహ్యమైన స్పందన రావడం జరిగింది. ఇప్పటి వరకు గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ లో కనిపించని పూరి జగన్నాథ్… లైవ్ లో చిరంజీవిని ఇంటర్ వ్యూ చేశారు. ఇలా చిరు, పూరి కలిసి లైవ్ ఇంటర్ వ్యూ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైమ్. ఈ ఇంటర్ వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను ఇద్దరూ పంచుకున్నారు.
ఇక ఇంటర్ వ్యూ చివరిలో చిరంజీవి… నాకు చెప్పిన ఆటోజానీ స్టోరీని ఏం చేశావ్..? అలాగే ఉంచావా..? లేక చించేశావా..? అని అడిగారు. దీనికి పూరి ఆ కథను చించేశాను. మీ కోసం పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేశాను. త్వరలోనే ఆ కథతో మిమ్మల్ని కలుస్తాను అని చెప్పారు. దీనికి చిరంజీవి నువ్వు ఎప్పుడంటే అప్పుడు కథ చెప్పచ్చు అన్నారు. చిరు, పూరి స్పీడు చూస్తుంటే…’వాల్తేరు వీరయ్య’, ‘భోళా శంకర్’ తర్వాత వీరిద్దరూ కలిసి సినిమా చేయడం ఖాయం అనిపిస్తుంది. మరి.. త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.
Also Read : ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కార్యవర్గంతో ‘మెగా’ముచ్చట్లు