Friday, April 4, 2025
HomeసినిమాChiranjeevi vs Rajini: చిరు 'భోళా శంకర్' వెర్సెస్ రజనీ 'జైలర్'

Chiranjeevi vs Rajini: చిరు ‘భోళా శంకర్’ వెర్సెస్ రజనీ ‘జైలర్’

టాలీవుడ్ లో సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పోటీపడ్డాయి. ఒక రోజు గ్యాప్ లోనే ఈ రెండు చిత్రాలు రిలీజ్ కావడం.. ఈ రెండు చిత్రాల్ని ఒకే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం. అయితే.. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయ్యాయి. వీరసింహారెడ్డి 100 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తే.. వాల్తేరు వీరయ్య 200 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. మొత్తానికి సంక్రాంతికి వచ్చిన చిరు వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లో సైతం బ్లాక్ బస్టర్ సాధించాయి.

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మరో సీనియర్ హీరోతో పోటీ పడుతున్నారు. ఆ సీనియర్ హీరో ఎవరో కాదు.. సూపర్ స్టార్ రజనీకాంత్. ఇంతకీ విషయం ఏంటంటే.. చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో చిరంజీవికి జంటగా తమన్నా నటిస్తుంటే… సిస్టర్ గా కీర్తి సురేష్ నటిస్తుంది. ఇందులో సుశాంత్ గెస్ట్ రోల్ చేస్తుండడం విశేషం. ఈ మూవీ ప్రస్తుతం కలకత్తాలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని ఆగష్టు 11న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు.

ఇక రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జైలర్’. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో మోహన్ లాల్,శివ రాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషిస్తుండడం విశేషం. ఇటీవల కాలంలో రజనీకాంత్ నుంచి సరైన సినిమా రాలేదు. దీంతో జైలర్ మూవీ పై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రాన్ని ఆగష్టు 10న విడుదల చేస్తున్నారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర చిరంజీవి, రజనీకాంత్ ఒక రోజు గ్యాప్ లో పోటీపడుతుండడం విశేషం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్