మెగాస్టార్ చిరంజీవి నేడు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను చెన్నైలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ భేటీలో స్టాలిన్ తనయుడు ఉదయనిధి కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత స్టాలిన్ ఎన్నో విప్లవాత్మక చర్యలు చేపట్టారని చిరంజీవి కొనియాడారు. పార్టీలకతీతంగా, విపక్షాలు సైతం మెచ్చుకునే నిర్ణయాలు తీసుకుంటూ తమిళ ప్రజల హృదయాలలోనే కాకుండా యావత్ దేశంలో కూడా గుర్తింపు తెచ్చుకుంటున్నారని చిరంజీవి ప్రసంశించారు. తన పాలనా దక్షతతో కోవిడ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారని చిరంజీవి పేర్కొన్నారు.