Sunday, January 19, 2025
Homeసినిమావైష్ణవి మరో జయసుధ కావడం ఖాయం: 'బేబి' ఈవెంటులో మెగాస్టార్  

వైష్ణవి మరో జయసుధ కావడం ఖాయం: ‘బేబి’ ఈవెంటులో మెగాస్టార్  

ఇటీవల కాలంలో యూత్ అంతా కూడా మాట్లాడుకున్న సినిమాగా ‘బేబి’ కనిపిస్తుంది. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా, అనూహ్యమైన స్థాయిలో విజయాన్ని అందుకుంది. వసూళ్ల పరంగా చూసుకుంటే 100 కోట్ల దిశగా దూసుకుపోతోంది. అలాంటి ఈ సినిమా విజయోత్సవ వేడుకను హైదరాబాదులో నిర్వహించారు. మెగాస్టార్ చీఫ్ గెస్టుగా ఈ కార్యక్రమం కొనసాగింది. చిరంజీవి మాట్లాడుతూ .. “పుత్రోత్సాహాన్ని  అనుభవిస్తూ ఉన్న నేను, నన్ను స్ఫూర్తిగా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చిన అభిమానుల విజయాలను చూస్తూ కూడా అంతే ఆనందాన్ని పొందుతున్నాను” అన్నారు.

“అలాంటి నా అభిమానులు ఈ సినిమా చేయడం .. పెద్ద విజయాన్ని సాధించడం .. ఈ వేడుకలో నేను భాగం కావడం నాకు చాలా సంతోషంగా .. గర్వంగా ఉంది. దర్శకుడిగా సాయిరాజేశ్ టాలెంట్ కి ‘బేబి’ సినిమా అద్దం పడుతోంది. ఈ సినిమా ద్వారా ఒక గొప్ప మెసేజ్ ను ఆయన సమాజానికి ఇవ్వగలిగాడు. భవిష్యత్తులో అతని నుంచి మరిన్ని మంచి సినిమాలు వస్తాయని ఆశిస్తున్నాను. అతను నా అభిమాని అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. ఇలాంటి కొత్త కుర్రాళ్లు ఇండస్ట్రీకి రావాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

‘బేబి’ సినిమాలో ఆనంద్ దేవరకొండ గొప్పగా నటించాడు. అతనిలో ఇంత టాలెంట్ ఉందా అనుకున్నాను. ఇక వైష్ణవి విషయానికి వస్తే, హీరోయిన్ గా మొదటి సినిమానే అయినా చాలా బాగా చేసింది. ఒక బస్తీ అమ్మాయి మాదిరిగానే అనిపించేలా నటించింది. వైష్ణవి నటనను చూస్తుంటే, నాకు జయసుధ గారు గుర్తొచ్చారు. ఆ స్థాయికి ఎదుగుతుందని నాకు అనిపిస్తోంది. అలాగే విరాజ్ కూడా చాలా బాగా నటించాడు. ఇది కేవలం లవ్ స్టోరీగా మాత్రమే కనిపించదు .. మూడు పాత్రల వైపు నుంచి మానసిక సంఘర్షణ ఉంది. విలన్ లేకుండా ఈ సినిమాను నడిపించడం మరో విశేషం” అంటూ చెప్పుకొచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్