Monday, September 30, 2024
Homeసినిమా'చిరు' విందులో కమల్ హాసన్, సల్మాన్ ఖాన్

‘చిరు’ విందులో కమల్ హాసన్, సల్మాన్ ఖాన్

Felicitation :  ఉలగ నాయగన్ కమల్ హాసన్ ను మెగా స్టార్ చిరంజీవి ఘనంగా సన్మానించారు.  కమల్ నటించిన  విక్రమ్ సినిమా  ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే శనివారం నాడు హైదరాబాదులో ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ సందర్భంగా తన చిరకాల మిత్రుడు కమల్, ఈ సినిమా దర్శకుడు  లోకేష్ కనగారాజ్ లను చిరంజీవి విందుకు ఆహ్వానించారు. ఈ విందుకు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు
మెగా కుటుంబానికి చెందిన హీరోలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కమల్ తో పాటు లోకేష్ కనగరాజ్ ను కూడా చిరంజీవి సన్మానించి ఆయన మీద ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఈ వేడుకకు విక్రమ్ సినిమాను తెలుగులో విడుదల చేసిన హీరో నితిన్ కూడా పాల్గొన్నారు. ఈ ఫోటోలను చిరు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
RELATED ARTICLES

Most Popular

న్యూస్