Sunday, January 19, 2025
Homeసినిమాచిరు నిర్మాతగా క్రేజీ మ‌ల్టీస్టార‌ర్?

చిరు నిర్మాతగా క్రేజీ మ‌ల్టీస్టార‌ర్?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా 150కు పైగా సినిమాల్లో న‌టించారు. అయితే.. నిర్మాత‌గా మాత్రం చేయ‌లేదు. అంజ‌నీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై నాగబాబు సినిమాలు నిర్మించారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ అంటూ రామ్ చ‌ర‌ణ్ నిర్మాణ సంస్థ‌ను స్టార్ట్ చేశారు. ఈ బ్యాన‌ర్ లో సైరా న‌ర‌సింహారెడ్డి, ఆచార్య చిత్రాల‌ను నిర్మించారు. ఈ చిత్రాల‌కు చ‌ర‌ణ్ నిర్మాత‌. అయితే.. ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి ‘లాల్ సింగ్ చ‌డ్డా‘ కి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇప్పుడు నిర్మాత‌గా మారి ఓ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ ను నిర్మించాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇంత‌కీ.. ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ ఎవ‌రితో అంటే.. నాగార్జున‌, అఖిల్ తో అని స‌మాచారం. మేట‌ర్ ఏంటంటే… గాడ్ ఫాద‌ర్ ని డైరెక్ట్ చేస్తున్న మోహ‌న్ రాజా చిరంజీవి, చ‌ర‌ణ్ ల కోస‌మ‌ని ఓ మ‌ల్టీస్టార‌ర్ స్టోరీని చిరంజీవికి వినిపించాడ‌ట‌. అయితే చిరంజీవి ఆ సినిమాలో నాగార్జున, అఖిల్` నటిస్తే బావుంటుందని సూచించారట. అంతేకాకుండా తాను నిర్మాతగా వ్యవహరిస్తానని మోహన్ రాజాకు మాటిచ్చారని స‌మాచారం.

నాగార్జున లాంటి స్టైలిష్ హీరో ఆ కథకు అవసరమని భావించి మోహన్ రాజాకు ఈ సూచన చేశారని తెలిసింది. ఇక ఈ కథను విని నాగ్, అఖిల్ కూడా వెంటనే ఓకే చెప్పారని స‌మాచారం. అన్నీ సవ్యంగా జరిగితే మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తారు. నాగ్ కి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ కూడా భాగస్వామిగా ఉంటుంది. త్వ‌ర‌లో ఈ మూవీని ప్ర‌క‌టిస్తార‌ని టాక్.

Also Read లాల్ సింగ్ చ‌డ్డాపై ఇంట్ర‌స్ట్ క్రియేట్ చేసిన చైతూ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్