Sunday, January 19, 2025
Homeసినిమాపవర్ స్టార్ ఫ్యాన్ గా మెగాస్టార్...?

పవర్ స్టార్ ఫ్యాన్ గా మెగాస్టార్…?

చిరంజీవి కొత్త తరహా సినిమాలు చేయాలి అనుకున్నారు. తన ఇమేజ్ ని పక్కన పెట్టి డిఫరెంట్ మూవీస్ చేశారు. అలా చేసిందే గాడ్ ఫాదర్. ఈ సినిమా ఫరవాలేదు అనిపించింది కానీ.. అశించిన స్థాయిలో మెప్పించలేదు. అంతకు ముందు చేసిన ఆచార్య సినిమా అయితే.. బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. దీంతో ఎలాగైనా సరే.. సక్సెస్ సాధించాలని తపించిన మెగాస్టార్.. బాబీతో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చేశారు. ఇందులో చిరంజీవిని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించారు డైరెక్టర్ బాబీ.

వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి నుంచి ఆశించే ఎంటర్ టైన్మెంట్ పుష్కలంగా ఉండడంతో బ్లాక్ బస్టర్ సాధించింది. 250 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. దీంతో చిరంజీవి ఆలోచనా విధానం పూర్తిగా మారిందట. ఇక నుంచి తన నుంచి అభిమానులు కోరుకునే సినిమాలే చేయాలని డిసైడ్ అయ్యారట. దీనికి అనుగుణంగానే ‘భోళా శంకర్‘ మూవీలో మార్పులు చేర్పులు చేశారని తెలిసింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ సినిమాలో మెగాస్టార్ మరోసారి సూపర్ మాస్ రోల్ లో నటిస్తుండగా ఈ రోల్ పై తాజాగా సినీ వర్గాల్లో వచ్చిన లేటెస్ట్ బజ్ ఒకటి ఒక్కసారిగా వైరల్ గా మారింది.

మేటర్ ఏంటంటే.. మెగాస్టార్ ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా కనిపిస్తారని తెలిసింది. అయితే దీని పై మాత్రం సోషల్ మీడియాలో మరియు ఆడియెన్స్ లో కాస్త మిక్సిడ్ రెస్పాన్స్ ని వచ్చిందని చెప్పాలి. అన్నయ్య తమ్ముడు అభిమానిగా చేయడం ఏంటి.? మెగాస్టార్ ఏంటి తన రేంజ్ ఏంటి అలాగే ఆల్రెడీ రీమేక్ సినిమాలో మళ్ళీ మరో సినిమాలో సీన్స్ రీ క్రియేట్ చేయడం ఏంటి..? అనేది హాట్ టాపిక్ అయ్యింది. అయితే.. ఇది నిజమేనా..? ప్రచారంలో ఉన్నట్టుగా చిరంజీవి పవన్ ఫ్యాన్ గా నటిస్తున్నాడా..? అనేది తెలియాల్సివుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్