Sunday, January 19, 2025
Homeసినిమామ‌హేష్ కి పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

మ‌హేష్ కి పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

Marriage Day wishes: మ‌హేష్ బాబు, న‌మ్రతా శిరోద్కర్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి చేసుకుని 17 ఏళ్లు అయ్యింది. ఈ రోజు పెళ్లి రోజు సంద‌ర్భంగా మ‌హేష్ బాబు ట్విట్టర్ లో ఫ్యామిలీతో ఉన్న‌ ఓ ఫోటో పోస్ట్ చేసి త‌న సంతోషాన్ని షేర్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే… ఈ రోజు చిరంజీవి, ప్రభాస్, రాజ‌మౌళి, కొర‌టాల శివ‌ల‌తో పాటు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ను క‌లిసి చిత్ర ప‌రిశ్రమ స‌మ‌స్యల గురించి చ‌ర్చించేందుకు మ‌హేష్ బాబు కూడా వెళ్లారు.

అయితే.. ఫ్లైట్ లో మ‌హేష్ బాబుకు చిరంజీవి, ప్రభాస్, రాజ‌మౌళి, కొర‌టాల శివ‌, నిర్మాత నిరంజ‌న్ రెడ్డి బొకే ఇచ్చి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియ‌చేశారు. ఈ ఫోటోను చిరంజీవి త‌న ట్విట్టర్ లో అకౌంట్ లో పోస్ట్ చేశారు. సోష‌ల్ మీడియాలో ఈ ఫోటో వైర‌ల్ గా మారింది.

Also Read : ఎండ్ కాదు… శుభం కార్డు పడుతుంది: చిరు

RELATED ARTICLES

Most Popular

న్యూస్